Published : Apr 21, 2022, 03:55 PM ISTUpdated : Apr 21, 2022, 03:57 PM IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇప్పటిదాకా పెద్దగా ఏదీ కలిసి రావడం లేదు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన చెననై సూపర్ కింగ్స్... మొదటి ఆరు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయంతో సరిపట్టుకుంది. ముంబైతో మ్యాచ్‌కి ముందు ఆడమ్ మిల్నే కూడా సీజన్ మొత్తానికి దూరమైనట్టు ప్రకటించింది సీఎస్‌కే...
ఫాఫ్ డుప్లిసిస్, శార్దూల్ ఠాకూర్ వంటి కీ ప్లేయర్లను వేరే జట్లకి వదిలేసిన చెన్నై సూపర్ కింగ్స్, రూ.14 కోట్లు పెట్టి దీపక్ చాహార్‌ని కొనుగోలు చేస్తే... అతను గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే...
27
న్యూజిలాండ్ పేసర్ ఆడమ్ మిల్నేని ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్‌లో ఒకే మ్యాచ్ ఆడి 2.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు ఆడమ్ మిల్నే...
37
Matheesha Pathirana
ఆడమ్ మిల్నే స్థానంలో శ్రీలంక యంగ్ పేసర్ మతీశ పతిరానని రిప్లేస్‌మెంట్‌గా తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. 19 ఏళ్ల మతీశ పతిరాన... అండర్ 19 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాడు...
47
పతిరానను బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కాంట్రాక్ట్ కుదుర్చుకోనుంది లంక. మతీశ పతిరాన బౌలింగ్ యాక్షన్ చూడడానికి లంక మాజీ బౌలర్ లసిత్ మలింగను పోలి ఉంటుంది...
57
ఇప్పటిదాకా లంక తరుపున రెండు టీ20 మ్యాచులు మాత్రమే ఆడిన పతీశ పతిరానకి ఇది లక్కీ ఆఫర్ కానుంది. అయితే లంక ప్లేయర్లను ఆడించడంపై తమిళ జనాలు గుర్రుగా ఉన్నారు.
67
శ్రీలంకలో తమిళ జనాలపై జరుగుతున్న దారుణాల కారణంగా తమిళనాడు జనాలు, లంకేయులపై కోపంగా ఉన్నారు. సీఎస్‌కే మహీశు తీక్షణను కొనుగోలు చేసిన సమయంలోనే ‘బాయ్‌కాట్ సీఎస్‌కే’ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు...
77
అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో మాహీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, రవీంద్ర జడేజా కెప్టెన్సీలో చెన్నై పెద్దగా విజయాలు అందుకోకపోవడంతో... తమిళ జనాలు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు...