Published : Apr 21, 2022, 12:26 PM ISTUpdated : Apr 21, 2022, 05:58 PM IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యంత ఆసక్తిగా అందరూ ఎదురుచూస్తున్న మ్యాచ్... ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్. ఐపీఎల్ చరిత్రలో ఏ మ్యాచ్‌లకీ రానంత క్రేజ్, హైప్... ఈ రెండు మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ మధ్య మ్యాచ్‌లకి ఉంటుంది...
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి సపోర్ట్ చేయని ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరుని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు... అందుకే ఐపీఎల్‌లో ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్‌ని ‘ El Clasico’ గా పేర్కొంటారు..
210
ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, నాలుగు సార్లు టైటిల్ విన్నర్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కలిసి ఈ సీజన్‌లో 12 మ్యాచులు ఆడితే ఒకే మ్యాచ్ గెలిచాయి..
310
ముంబై అయితే మరీ ఘోరంగా ఇప్పటిదాకా అరడజను మ్యాచులు ఆడినా బోణీ కొట్టలేకపోయింది. అందుకే సీఎస్‌కే మ్యాచ్ కోసం ముంబై టీమ్ ఆశగా ఎదురుచూస్తోంది... ఎందుకంటే చెన్నైతో మ్యాచ్ అంటే ముంబై చెలరేగిపోతుంది...
410
ఫుల్‌బాల్ వరల్డ్‌లో బార్సిలోనా, రియల్ మాడ్రిడ్ క్లబ్స్ మధ్య జరిగే మ్యాచ్‌ని El Clasico అని పిలుస్తారు. క్రికెట్‌లో, ఐపీఎల్‌లో అలాంటి ఘనత ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌కి దక్కింది...
510
బ్యాడ్‌లక్ కారణంగా రెండేళ్లు బ్యాన్ పడి చెన్నై సూపర్ కింగ్స్... రెండు సీజన్లు ఆడలేదు కానీ ఆడి ఉంటే... తమ ఖాతాలో కూడా ఐదు టైటిల్స్ ఉండేవని.. సీఎస్‌కే ఫ్యాన్స్ వాదన...
610
ఐపీఎల్ చరిత్రలో ముంబైపై సీఎస్‌కే ఘనమైన రికార్డు ఉంది. ఇప్పటిదాకా ఇరుజట్ల మధ్య 32 మ్యాచులు జరగగా చెన్నై 13 మ్యాచుల్లో గెలిస్తే, ముంబైకి 19 మ్యాచుల్లో విజయం దక్కింది...
710
గత 14 మ్యాచుల్లో ఐదు సీజన్లలో ముంబై ఇండియన్స్ 10 మ్యాచుల్లో గెలిస్తే... చెన్నై సూపర్ కింగ్స్‌కి కేవలం 4 మ్యాచుల్లో మాత్రమే విజయం దక్కింది. దీంతో సీఎస్‌కేతో మ్యాచ్ ముంబైకి కమ్‌బ్యాక్ మ్యాచ్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్...
810
మొదటి ఆరు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే నేటి మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే...
910
అదే సీఎస్‌కే విషయానికి వస్తే... ఆర్‌సీబీతో మ్యాచ్ గెలిచి బోణీ కొట్టిన జడ్డూ టీమ్... నేటి మ్యాచ్‌లో ఓడినా, మిగిలిన 7 మ్యాచుల్లో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుతుంది...
1010
2018 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై 1 వికెట్ తేడాతో గెలిచి ఉత్కంఠ విజయం సాధించింది సీఎస్‌కే. 2019 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్‌కే 1 పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుని టైటిల్ కొట్టింది... ఇలాంటి మ్యాచులు చూసేందుకు ముంబై వర్సెస్ సీఎస్‌కే మ్యాచ్‌ని EL Clasico...గా పిలుస్తారు ఫ్యాన్స్...