Published : Apr 21, 2022, 01:08 PM ISTUpdated : Apr 21, 2022, 01:10 PM IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేసింది. ఒక్క విజయం అందుకుని, రిథమ్‌లోకి వస్తే చాలు... వరుసగా మ్యాచులు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ముంబై ప్లేయర్లు. గాయం కారణంగా లేటుగా టీమ్‌లో చేరినా, నిలకడైన పర్ఫామెన్స్ ఇస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్...
ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన 8 సీజన్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. కెరీర్ ఆరంభంలో కేకేఆర్‌కి ఆడిన సూర్య, 2018లో ముంబై ఇండియన్స్‌కి మారాడు...
211
2018 సీజన్‌లో 512, 2019లో 424, 2020 సీజన్‌లో 480 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, 2021 ఆరంభంలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి... నిలకడైన ప్రదర్శనతో జట్టులో స్థానం పదిలం చేసుకున్నాడు...
311
‘‘నేను నా భార్యతో 2010 నుంచి డేటింగ్ చేస్తున్నా. 2016లో మా పెళ్లి జరిగింది. నేను దేశవాళీ క్రికెట్ ఆడుతున్నా అని, ఐపీఎల్ ఆడుతున్నా అని ఆమెకు పెళ్లికి ముందే తెలుసు...
411
పెళ్లైన తర్వాత ఓ రోజు... నా దగ్గరికి వచ్చి ‘అంతా బాగానే ఉంది కానీ... నీ గాడీ ముందుకు వెళ్లడం లేదు ఎందుకు?...’ అని అడిగింది...
511
నాతో కలిసి అండర్ 23 ఆసియా కప్ ఆడిన అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, కెఎల్ రాహుల్... అందరూ 2015లోనే టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసేశారు...
611
అప్పుడు నాకు అనిపించింది, గత మూడేళ్లలో నేను చేసిన తప్పులు ఏంటో సరిచూసుకున్నా. నా న్యూట్రిషియన్‌ని, బ్యాటింగ్ కోచ్‌ని మార్చేశా... ప్రతీ డిపార్ట్‌మెంట్‌లో పూర్తి ఎఫర్ట్ పెట్టి, రిజల్ట్ ఎందుకు రాదో చూడమని ఆమె చెప్పింది...
711
మా ఇద్దరి నిర్ణయంతో క్రికెట్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టాను. ఫ్రెండ్స్‌తో కలిసి లేట్ నైట్ డిన్నర్స్‌కి వెళ్లనిచ్చేది కాదు, అన్నింటికీ ఓ టైం ఉండాల్సిందే. ప్రతీదానికి ప్లాన్ ఉండాల్సిందే...
811
క్రికెట్‌కి, నా ప్రాక్టీస్‌కి ఏదీ అడ్డు రాకుండా నిర్ణయాలు తీసుకుంది. ఆమె చేసే పనుల వల్లే నేను క్రికెట్‌ని సీరియస్‌గా తీసుకుని ట్రై చేశా... నాకు భారత క్యాప్ వచ్చింది. మొదటి మ్యాచ్ బాగా ఆడా...
911
మ్యాచ్ అయ్యాక నా రూమ్‌కి వెళ్లి ఆ రోజు నా ఆటను మళ్లీ టీవీలో చూసుకున్నా. అందరూ నా గురించి ఏమేం అంటున్నారో విన్నా. అలా తర్వాతి రోజు 4 గంటల వరకూ వీడియోలు చూస్తూనే ఉన్నా...
1011
ఆ రోజే నా భార్య వచ్చి.. ‘నీ కెరీర్ ఇప్పుడే మొదలైంది. ఇదే అసలైన ప్రయాణం...’ అని చెప్పింది. ప్రతీ విషయం గురించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది...
1111
నేను సౌతాఫ్రిా టూర్‌కి వెళ్లినప్పుడు, రోహిత్ శర్మ చెప్పాడు. నా భార్య దేవిశా వల్లే నా కెరీర్, నా జీవితం మలుపు తిరిగిందని! అప్పుడే నాకు అర్థమైంది... నా సక్సెస్‌ను ప్రపంచం కూడా గుర్తించిందని... ’’ అంటూ చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్.