ఐపీఎల్ లో ఇది అశ్విన్ కు ఐదో జట్టు. గతంలో అతడు చెన్నై తో పాటు పంజాబ్, ఢిల్లీలకు కూడా ఆడాడు. ఇక రాజస్థాన్ సారథి సంజూ శాంసన్ పై స్పందిస్తూ.. ‘సంజూ అద్భుతమైన సారథి. అతడి అటిట్యూడ్ నాకు చాలా ఇష్టం. అతడెప్పుడూ చర్చకు సిద్ధంగా ఉంటాడు. గేమ్ చుట్టూ ఉన్న అభిప్రాయాలను పంచుకుంటాడు. క్రికెటర్ కు ఆ క్వాలిటీ కలిగి ఉండగం గొప్ప విషయం.. ’అని ప్రశంసించాడు.