డబ్బుల కోసం కాదు, కేవలం దాని కోసమే పంజాబ్ కింగ్స్‌ను వీడాను... కెఎల్ రాహుల్ కామెంట్...

Published : Mar 21, 2022, 03:34 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యధిక మొత్తం అందుకోబోతున్న ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు కెఎల్ రాహుల్. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఏకంగా రూ.17 కోట్లకు కెఎల్ రాహుల్‌ను డ్రాఫ్ట్‌గా కొనుగోలు చేసి, కెప్టెన్‌గా ఎంచుకుంది...

PREV
19
డబ్బుల కోసం కాదు, కేవలం దాని కోసమే పంజాబ్ కింగ్స్‌ను వీడాను... కెఎల్ రాహుల్ కామెంట్...

ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గా రూ.17 కోట్లు అందుకున్న విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఎమ్మెస్ ధోనీ, రవీంద్ర జడేజా కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకోబోతున్నాడు...
 

29

గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్ సారథిగా వ్యవహరించిన కెఎల్ రాహుల్, ఏటా రూ.11 కోట్లు పారితోషికంగా అందుకున్నాడు. కెఎల్ రాహుల్‌ని రిటైన్ చేసుకుని, రూ.12 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది పంజాబ్ కింగ్స్...

39

అయితే లక్నో సూపర్ జెయింట్స్ భారీ మొత్తం ఆఫర్ చేయడంతో కెఎల్ రాహుల్, మరో ఆలోచన లేకుండా పంజాబ్ కింగ్స్ జట్టును వీడాడు. తనతో పాటు యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్‌ని కూడా లక్నోకి తీసుకొచ్చాడు...

49

అయితే పంజాబ్ కింగ్స్‌ని వీడి, లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరడానికి డబ్బు కారణం కాదని అంటున్నాడు 2020 సీజన్ ఆరెంజ్ క్యాప్ విన్నర్ కెఎల్ రాహుల్...

59


‘పంజాబ్ కింగ్స్‌ తరుపున నాలుగేళ్లుగా ఆడుతున్నా. ఆ జట్టు తరుపున ఆడడాన్ని బాగా ఎంజాయ్ చేశా. అయితే నాలో ఎంత సత్తా ఉందో, నాకు నేనే సవాల్ విసరాలని అనుకున్నా...

69

అందుకే కొత్త టీమ్‌తో ప్రయాణం మొదలెట్టాలని నిర్ణయం తీసుకున్నా. ఇది చాలా కఠినమైన నిర్ణయం. పంజాబ్ కింగ్స్‌తో నా అనుబంధం మరువలేనిది. వారికి మరే సాయం కావాలన్నా చేయడానికి నేను ఇప్పటికీ సిద్ధంగా ఉన్నా..’ అంటూ కామెంట్ చేశాడు కెఎల్ రాహుల్....

79

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి 2018 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌లో చేరిన కెఎల్ రాహుల్, అదే సీజన్‌లో 659 పరుగులు చేసి అదరగొట్టాడు...

89

2019 సీజన్‌లో రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్సీలో ఆడిన కెఎల్ రాహుల్, 593 పరుగులు చేశాడు. 2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచాడు...

99

2022 సీజన్‌లోనూ 626 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, కడుపునొప్పితో ఓ మ్యాచ్‌కి దూరం కావడంతో ఆరెంజ్ క్యాప్‌‌ను కోల్పోవాల్సి వచ్చింది...

Read more Photos on
click me!

Recommended Stories