శ్రేయాస్ అయ్యర్... ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో గాయపడడానికి ముందు టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ రేసులో అందరి కంటే ముందున్న యంగ్ ప్లేయర్. టూ డౌన్ ప్లేయర్‌గా నిలకడైన ప్రదర్శనతో తన స్థానాన్ని పదిలం చేసుకున్న శ్రేయాస్ అయ్యర్, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడడంతో అతని కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది..
గాయం కారణంగా దాదాపు మూడు నెలల పాటు జట్టుకి దూరమైన శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌కి సూర్యకుమార్ యాదవ్ స్పాట్ పెట్టేశాడు. నిలకడగా రాణిస్తూ, అయ్యర్ కంటే వేగంగా పరుగులు చేస్తూ... సూర్యకుమార్ యాదవ్, టూ డౌన్ ప్లేస్‌కి కరెక్ట్ ప్లేయర్‌గా నిరూపించుకున్నాడు...
210
సూర్యకుమార్ యాదవ్ కారణంగా గాయం నుంచి కోలుకున్న తర్వాత కూడా తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు శ్రేయాస్ అయ్యర్. రిజర్వు బెంచ్‌లోనే ఎదురుచూడాల్సి వచ్చింది...
310
అలాగే గాయం కారణంగా ఐపీఎల్‌లోనూ కెప్టెన్సీ కోల్పోయాడు శ్రేయాస్ అయ్యర్. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని మొట్టమొదటిసారిగా ఫైనల్‌కి తీసుకెళ్లిన శ్రేయాస్ అయ్యర్, గాయం కారణంగా 2021 సీజన్ ఫస్ట్ ఫేజ్‌కి అందుబాటులో లేడు.
410
అతని స్థానంలో రిషబ్ పంత్‌ని కెప్టెన్‌గా ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈ యంగ్ వికెట్ కీపర్ కెప్టెన్సీ స్కిల్స్ విపరీతంగా నచ్చడంతో సెకండ్ ఫేజ్ సమయానికి శ్రేయాస్ అయ్యర్ కోలుకున్నా, రిషబ్ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది...
510
దీంతో కెప్టెన్సీ కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన శ్రేయాస్ అయ్యర్, 2022 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...
610
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ వంటి కెప్టెన్ల కెప్టెన్సీలో ఆడిన శ్రేయాస్ అయ్యర్, వాళ్లందరి కంటే తనకి కెఎల్ రాహుల్ కెప్టెన్సీయే బాగా నచ్చిందంటూ ఫన్నీ కామెంట్లు చేశాడు...
710
‘కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడడాన్ని బాగా ఎంజాయ్ చేశాను. అతను ఓ అద్భుతమైన ప్లేయర్. ఫీల్డ్‌లో, టీమ్ మీటింగ్స్‌లో రాహుల్ ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది...
810
ప్లేయర్లకు అతను ఇచ్చే సపోర్ట్ అద్భుతం. అన్నింటికీ మించి శ్రేయాస్ అయ్యర్ నాకు బౌలింగ్ ఇచ్చాడు. మిగిలిన కెప్టెన్లు ఎవ్వరూ నాకు బౌలింగ్ ఇచ్చే సాహసం చేయలేదు. అందుకే కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో ఆడడాన్ని బాగా ఎంజాయ్ చేశా...’ అంటూ కామెంట్ చేశాడు శ్రేయాస్ అయ్యర్...
910
కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో సౌతాఫ్రికా టూర్‌లో ఓ టెస్టు, మూడు వన్డేలు ఆడిన భారత జట్టు, నాలుగింట్లోనూ చిత్తుగా ఓడి... వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయ్యింది...
1010
సూర్యకుమార్ యాదవ్ గాయం కారణంగా తప్పుకోవడంతో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో చోటు దక్కించుకున్న శ్రేయాస్ అయ్యర్, హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు. అలాగే టెస్టు సిరీస్‌లో కూడా మంచి పర్ఫామెన్స్ కనబరిచాడు.