ఐపీఎల్‌లో కెఎల్ రాహుల్ సక్సెస్ సీక్రెట్ ఇదే... గౌతమ్ గంభీర్‌ని అలా అడ్డం పెట్టుకుని...

Published : Jun 02, 2022, 09:58 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన నాలుగు జట్లలో లక్నో సూపర్ జెయింట్స్ ఒకటి. ఆరంభ మ్యాచుల్లో విఫలమైన లక్నో, ఆ తర్వాత సూపర్ విజయాలతో 9 విజయాలతో ప్లేఆఫ్స్‌కి వచ్చింది... అయితే ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతుల్లో ఓడి నాలుగో స్థానానికే పరిమితమైంది...

PREV
110
ఐపీఎల్‌లో కెఎల్ రాహుల్ సక్సెస్ సీక్రెట్ ఇదే... గౌతమ్ గంభీర్‌ని అలా అడ్డం పెట్టుకుని...
Image Credit: PTI

ఐపీఎల్‌లో కెఎల్ రాహుల్‌కి కెప్టెన్‌గా చెప్పుకోదగ్గ రికార్డు లేదు. బ్యాటర్‌గా గత మూడు సీజన్లలో 600+ పరుగులు చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచిన కెఎల్ రాహుల్, 2020-21 సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు కెఎల్ రాహుల్...

210

గత రెండు సీజన్లలోనూ 600+ పరుగులు చేసిన కెఎల్ రాహుల్, 2020 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ గెలిచినా పంజాబ్ కింగ్స్‌ని విజయతీరాలకు చేర్చలేకపోయాడు. 2020. 21 సీజన్లలో ఆరో స్థానానికే పరిమితమైంది పంజాబ్ కింగ్స్... 

310

అయితే ఈ సీజన్‌లో మాత్రం కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్, సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన రెండో జట్టుగా టీమ్‌ని నిలపగలిగాడు...
 

410
Quinton de Kock, KL Rahul

ఈ సక్సెస్ కారణంగానే సౌతాఫ్రికా టూర్‌లో వన్డే సిరీస్‌లో క్లీన్‌ స్వీప్ అయిన తర్వాత కూడా సఫారీలతో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌కి తిరిగి ఎంపికయ్యాడు కెఎల్ రాహుల్..

510

ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా తన సక్సెస్‌కి గల కారణాలను బయటపెట్టాడు కెఎల్ రాహుల్... ‘లీగ్ స్టేజీలో మా బౌలర్లు, ఫీల్డర్లు కూడా చక్కగా రాణించారు. బ్యాటర్‌గా నాతో పాటు దీపక్ హుడా, క్వింటన్ డి కాక్ చేసిన పరుగులు మమ్మల్ని ప్లేఆఫ్స్‌కి తీసుకెళ్లాయి...

610

భారీగా పరుగులు ఇవ్వకుండా బౌలర్లను మోటివేట్ చేయడం చాలా ముఖ్యం. అయితే గంభీర్ కారణంగా నాకు ఆ పని సులువైపోయింది. ఎవరైనా ఎక్కువ పరుగులు ఇస్తే, వారిని గౌతీ భాయ్‌ ఉండే ప్లేస్‌లో ఫీల్డింగ్‌లో నిలబెడతానని చెప్పేవాడిని...

710

ఫీల్డింగ్‌లో తప్పులు చేసిన సరే, ఇదే చేస్తానని చెప్పేవాడిని. దీంతో వాళ్లే దారిలోకి వచ్చేవాళ్లు. ఏ ప్లేయర్‌కి అయినా ఇంతకంటే మోటివేషన్ ఏముంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్...

810

ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో ఫీల్డర్లు ఈజీ క్యాచులను నేలపాలు చేశారు. దినేశ్ కార్తీక్ ఇచ్చిన క్యాచ్‌ను కెఎల్ రాహుల్, రజత్ పటిదార్ ఇచ్చిన క్యాచ్‌ను దీపక్ హుడా జారవిడిచారు. ఈ రెండు క్యాచులకు భారీ మూల్యం చెల్లించుకుంది లక్నో.. 

910
KL Rahul-Gautam Gambhir

ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ మెంటర్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్, డగౌట్‌లో ప్లేయర్లపై కోపం చూపించడం, విజయం తర్వాత గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం, ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిన తర్వాత సీరియస్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి..

1010

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా కాస్తో కూస్తో సక్సెస్ అయ్యాడనే ఉద్దేశంతో సఫారీ టూర్‌లో కెప్టెన్‌గా అట్టర్ ఫ్లాప్ అయినా కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ. స్వదేశంలో నాలుగేళ్లుగా టీ20 సిరీస్ ఓడిపోని టీమిండియా రికార్డును కెఎల్ రాహుల్ ఏం చేస్తాడో చూడాలి... 

click me!

Recommended Stories