MS Dhoni: చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్.. ధోని పై బీహార్ లో చెక్ బౌన్స్ కేసు

First Published Jun 1, 2022, 7:42 PM IST

FIR filed against MSD: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని చిక్కుల్లో పడ్డాడు. ఓ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించినందుకు గాను ధోనికి ఈ చిక్కులు వచ్చాయి.  

చెన్నై సూపర్ కింగ్స్ సారథి  మహేంద్ర సింగ్ ధోని చిక్కుల్లో పడ్డాడు. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించిన ధోని పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారు  బీహార్ లోని బెగుసరాయ్ పోలీసులు. 

అసలేం జరిగిందంటే.. ధోని భారత జట్టుకు సారథిగా ఉన్నప్పుడు అతడు బీహార్ కు చెందిన న్యూ ఇండియా గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ కు ప్రమోటర్ గా వ్యవహరించాడు. ఇది ఒక ఎరువులు తయారీ చేసే సంస్థ. 

Latest Videos


సదరు సంస్థ.. ఎస్కే ఎంటర్ప్రైజెస్ అనే మరో సంస్థకు రూ. 30 లక్షలు విలువ చేసే ఎరువులు సరఫరా చేసింది. అయితే ఈ వ్యవహారంలో డీలర్ తాము ముందు కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా నడుచుకోలేదని..  దాని వల్ల తాము కొనుగోలు చేసిన ఎరువులు అలాగే అమ్ముడుపోకుండా  ఉండిపోయాయని ఆరోపించింది. 

అయితే  న్యూఇండియా గ్లోబర్ ప్రొడ్యూస్ సంస్థ.. బాధిత సంస్థ నుంచి తిరిగి ఆ ఎరువులను తీసుకుంది. బదులుగా వాళ్లకు రూ. 30 లక్షలు విలువ చేసే చెక్ ను  ఇచ్చింది. 

MS Dhoni

ఆ చెక్ ను బ్యాంక్ లో వేసుకున్నా అందులో డబ్బులు లేక అది కాస్తా బౌన్స్ అయింది. దీంతో షాక్ తిన్న ఎస్కే ఎంటర్ ప్రైజెస్..  ధోని ప్రమోట్ చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసులు పంపింది.కానీ వాళ్లకు న్యూఇండియా సంస్థ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో ఎస్కే ఎంటర్ప్రైజెస్ ఓనర్ నీరజ్ కుమార్ నిరల.. న్యూఇండియా సంస్థతో పాటు ధోని పై  కూడా కేసు నమోదు చేశాడు.  ఏడుగురి పేరును ఎఫ్ఐఆర్ లో జతపరిచాడు.  

ఇటీవలే బెగుసరాయ్ లోని వినయోగదారుల ఫోరం కోర్టు లో ఈ కేసును  విచారించిన న్యాయమూర్తి..  దీనిని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్ మిశ్రాకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఈ కేసు తిరిగి  జూన్ 28న విచారణ కు రానున్నది. 

click me!