కెఎల్ రాహుల్... గత 50 ఏళ్లల్లో వరుసగా నాలుగు పరాజయాలు అందుకున్న మొట్టమొదటి భారత కెప్టెన్. సౌతాఫ్రికా టూర్‌లో కెప్టెన్‌గా అట్టర్ ఫ్లాప్ అయిన కెఎల్ రాహుల్‌కి మరోసారి కెప్టెన్సీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
సఫారీ టూర్‌లో ఘోరంగా ఓడి, ఆతిథ్య జట్టుకి క్లీన్ స్వీప్ ఇచ్చిన కెఎల్ రాహుల్‌ని, స్వదేశంతో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి కెప్టెన్‌గా ఎంపిక చేసింది. సౌతాఫ్రికాలో జరిగిన పరాభవానికి అతనితోనే ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనతో వేసిన మాస్టర్ స్టెప్ కావచ్చు...
28
Image Credit: Getty Images
రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోవడంతో శిఖర్ ధావన్ లేదా హార్ధిక్ పాండ్యాలకు సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో కెప్టెన్సీ దక్కవచ్చని ప్రచారం జరిగింది. అయితే శిఖర్ ధావన్‌ని టీ20 సిరీస్‌కి ఎంపిక చేయని సెలక్టర్లు, హార్ధిక్ పాండ్యాకి ఆల్‌రౌండర్‌గా చోటు కల్పించారు...
38
Image Credit: PTI
ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ సాధించాడు కెఎల్ రాహుల్. అయితే రాహుల్ సక్సెస్ వెనకాల గౌతమ్ గంభీర్ ఉన్నాడనేది అందరికీ తెలిసిన విషయమే...
48
ప్లేయర్ల ఎంపిక దగ్గర్నుంచి ఏ బౌలర్‌తో ఏ ఓవర్ వేయించాలనేది గంభీర్ నిర్ణయించేవాడు. ఫీల్డింగ్ మార్పులను కూడా డగౌట్ నుంచే చూస్తున్నాడు. దీంతో రాహుల్ సక్సెస్‌లో ఎక్కువ క్రెడిట్ గంభీర్‌కే వెళ్లింది...
58
అంతకుముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా రెండు సీజన్లు చేసిన కెఎల్ రాహుల్... సారథిగా ఎంత సక్సెస్ సాధించాడో అందరికీ తెలిసింది. అలాంటి కెఎల్ రాహుల్‌ని నమ్మి, మరోసారి కెప్టెన్సీ ఇవ్వడంపై టీమిండియా ఫ్యాన్స్, సెలక్టర్లను ట్రోల్స్ చేస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు...
68
Virat Kohli KL Rahul
సౌతాఫ్రికా టూర్‌లో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, జస్ప్రిత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు ఉన్న టీమ్‌నే గెలిపించలేకపోయాడు కెఎల్ రాహుల్. ఇప్పుడు పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లతో నిండిన టీమ్‌ని ఏం చేస్తాడో అని భయపడుతున్నారు...
78
ఎవరి చేతుల్లో ఓడారో వారితోనే మళ్లీ సిరీస్ గెలవాలనే రివెంజ్ ప్లాన్ మంచిదే కానీ రిజల్ట్ తేడా కొడితే భారత జట్టు పరువు పోతుందని వాపోతున్నారు. కెఎల్ రాహుల్‌కి బదులు రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ ఇచ్చినా బాగుండేదని అంటున్నారు...
88
ఒకవేళ ఈ సిరీస్‌లో నిజంగానే కెఎల్ రాహుల్ టీమ్, సౌతాఫ్రికాని ఓడిస్తే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో అతని పేరు ఖరారు అయిపోతుందని భయపడుతున్నవారు లేకపోలేదు...