వరల్డ్ కప్‌లో బాగా ఆడినా, పక్కన బెట్టేశారు... క్రిస్ గేల్‌‌ను కలిసి అడిగితే...

Published : Mar 29, 2022, 08:20 PM IST

టీమిండియా తరుపున మూడు ఫార్మాట్లు ఆడుతున్న అతికొద్ది మంది ప్లేయర్లలో కెఎల్ రాహుల్ ఒకడు. నయా కెప్టెన్ రోహిత్ శర్మకి వైస్ కెప్టెన్‌గా నియమితుడైన కెఎల్ రాహుల్... సౌతాఫ్రికా టూర్‌లో భారత జట్టుకి సారథిగానూ వ్యవహరించాడు...

PREV
111
వరల్డ్ కప్‌లో బాగా ఆడినా, పక్కన బెట్టేశారు... క్రిస్ గేల్‌‌ను కలిసి అడిగితే...

ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కెఎల్ రాహుల్. లక్నో సూపర్ జెయింట్స్‌కి సారథిగా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్‌ రూ.17 కోట్లు అందుకుంటున్నాడు...

211

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2019 టోర్నీ ఆడిన కెఎల్ రాహుల్, 9 ఇన్నింగ్స్‌ల్లో 45.12 సగటుతో 361 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు...

311

వన్డే వరల్డ్ కప్‌ తర్వాత వెస్టిండీస్‌కి పర్యటనకి వెళ్లిన భారత జట్టులో కెఎల్ రాహుల్‌కి చోటు దక్కలేదు. ఈ ప్రస్టేషన్‌లో ఉన్న సమయంలో కెఎల్ రాహుల్‌ని క్రిస్ గేల్ ఓదార్చాడట...

411

‘2019లో వన్డే వరల్డ్ కప్‌లో చాలా బాగా ఆడాను. ఆ తర్వాత వెస్టిండీస్‌ పర్యటనకి వెళ్లిన టీమ్‌లో చాలా చోటు దక్కలేదు. వరల్డ్ కప్‌లో బాగా ఆడాను...

511

ఆ ఫస్ట్రేషన్‌లో క్రిస్ గేల్‌కి మెసేజ్ చేశా. అతను వెంటనే పూల్ దగ్గరికి నేను, నేను డ్రింక్ చేస్తున్నా... అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాతి రోజే క్రిస్ గేల్‌కి 300వ మ్యాచ్...

611

ఆ సంతోషంలో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు క్రిస్ గేల్. నేను వెళ్లగానే, తను నా దగ్గరికి వచ్చి తీసుకెళ్లి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు...

711

నువ్వు ఎందుకు ఆడడం లేదని అడిగాడు.. నీకు తెలుసుగా వరల్డ్ కప్‌లో బాగానే ఆడా, అయినా ఈ సిరీస్ ఆడడం లేదు. నాకెందుకో ఇది కరెక్ట్ కాదని అనిపిస్తోంది...

811

తను నాతో ‘నువ్వు ఆడకపోవడానికి వంద కారణాలు ఉండొచ్చు, అవి నీ చేతుల్లో ఉండవు. టీమ్‌లో ఉండడానికి 70 కారణాలు ఉంటే తక్కువ అనుకో, కాదు 150 తక్కువ అనుకో...

911

నన్ను తీసుకోవడానికి 150, 200 కారణాలు ఉంటే తక్కువ అనుకో... మ్యాచ్ ఆడకపోవడానికి గల కారణాలను ఆ కోణంలో చూడు. అప్పుడు నువ్వు టీమ్‌లోకి రావడానికి ఏం చేయాలో తెలుస్తుంది...

1011

ఐపీఎల్‌లో 600 పరుగులు చేస్తే సరిపోతుందా? లేక 800 చేయాలా? నువ్వు వరల్డ్ కప్‌లో 50, 60లు చేస్తే సరిపోదనుకుంటే... 100-120 చేయడంపై ఫోకస్ పెట్టు...

1111

నీ సత్తాను నువ్వే పరీక్షించుకోవాలి, నీ లిమిట్‌ను నువ్వే పెంచుకుంటూ పోవాలి...’ అని క్రిస్ గేల్ చెప్పిన మాటలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు కెఎల్ రాహుల్...

click me!

Recommended Stories