చెన్నైని దెబ్బేసిన కేకేఆర్ సెంటిమెంట్... రెండు సార్లు ఫైనల్ ఆడితే, ప్రతీసారీ ఇంతే..

First Published May 21, 2022, 11:40 AM IST

క్రికెట్ ప్రపంచంలో సెంటిమెంట్స్‌కి కూడా చాలా విలువ ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఇలాంటి సెంటిమెంట్స్ ఎక్కువే. తాజాగా ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, సూపర్ ఫెయిల్యూర్‌కి అలాంటి ఓ సెంటిమెంట్ కారణమంటున్నారు అభిమానులు...
 

ఐపీఎల్ 2022 సీజన్‌లో 4 మ్యాచుల్లో గెలిచిన చెన్నైసూపర్ కింగ్స్, 10 మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది... సీఎస్‌కే, ఒకే సీజన్‌లో 10 మ్యాచులు ఓడిపోవడం ఇదే మొట్టమొదటిసారి...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఏడో స్థానంలో నిలిచి ఘోర పరాభవాన్ని మూటకట్టుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాతి సీజన్‌లో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇస్తూ, నాలుగో టైటిల్ సొంతం చేసుకుంది...

Latest Videos


ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ని ఓడించిన సీఎస్‌కే, నాలుగోసారి టైటిల్ కైవసం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగడం ఇది రెండోసారి...

2012 ఐపీఎల్ సీజన్ ఫైనల్‌లో తొలిసారి టైటిల్ ఫైట్‌లో తలబడ్డాయి కేకేఆర్, సీఎస్‌కే. చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, మొట్టమొదటి ఐపీఎల్ టైటిల్ గెలిచింది...

అయితే ఆ తర్వాతి సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ ఘోరంగా విఫలమైంది. తొలిసారి ఒకే సీజన్‌లో 10 మ్యాచుల్లో ఓడి, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగి... ఏడో స్థానంతో సరిపెట్టుకుంది...

2021 ఫైనల్‌లో కేకేఆర్‌ని ఓడించి, నాలుగోసారి టైటిల్ కైవసం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. అప్పుడు కేకేఆర్‌ని వెంటాడినట్టే, ఈసారి సీఎస్‌కే... టైటిల్ గెలిచిన తర్వాతి సీజన్‌లో 10 మ్యాచుల్లో ఓడి ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది...

చెన్నై సూపర్ కింగ్స్ పరాభవానికి ఫైనల్‌లో కేకేఆర్‌తో తలబడడమే కారణమంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్. 2013 సీజన్‌లో గ్రూప్ స్టేజీలో టేబుట్ టాపర్‌గా నిలిచిన సీఎస్‌కే, ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడింది...

2022 సీజన్‌లో 8 పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న లాస్ట్ సీజన్ రన్నరప్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. అయితే పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం కేకేఆర్ పొజిషన్‌ని డిసైడ్ చేయనుంది...

click me!