అప్పుడు ఊఊ అన్నాడు, ఇప్పుడేమో ఊ అన్నాడు... ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన మాహీ...

First Published May 20, 2022, 8:28 PM IST

ఎమ్మెస్‌ ధోనీ ఆడే హెలికాఫ్టర్ షాట్స్‌కి, వికెట్ల వెనకాల అతను పట్టే కళ్లు చెదిరే క్యాచులకు మాత్రమే కాదు... మాహీ స్పీచ్‌కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి మూడు సీజన్లుగా ప్రచారం జరుగుతోంది... 

ఐపీఎల్ 2020 సీజన్‌కి ముందే ఎమ్మెస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడంతో, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ మాహీ రిటైర్ అవుతాడని ప్రచారం జరిగింది...

Jadeja-Dhoni

పాండ్యా బ్రదర్స్‌ నుంచి యంగ్ క్రికెటర్లు అందరూ మాహీతో సెల్ఫీలు దిగేందుకు, ధోనీ ఆటోగ్రాఫ్ చేసిన నెం.7 ఎల్లో జెర్సీలు తీసుకోవడానికి క్యూ కట్టారు... దీంతో మాహీ రిటైర్మెంట్ ఊహగానాలు మరింత ఊపందుకున్నాయి...

Latest Videos


అయితే ఐపీఎల్ 2020 సీజన్‌‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి లీగ్ మ్యాచ్ సమయంలో ‘ఎల్లో జెర్సీలో ఇదే మీకు ఆఖరి సీజన్ ఆ...’ అంటూ డానీ మోరీసన్ అడిగిన ప్రశ్నకు ‘డిఫెనెట్‌లీ నాట్... (Definately Not)’ అంటూ ఎమ్మెస్ ధోనీ ఇచ్చిన సమాధానం, అప్పట్లో తెగ వైరల్ అయ్యింది...

Image Credit: Getty Images

ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుస పరాజయాలతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచిన సీఎస్‌కే, 2021 సీజన్‌లో టైటిల్ గెలిచి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది... టైటిల్ గెలిచిన తర్వాత వచ్చే సీజన్‌లో ఆడతారా? అంటూ ప్రశ్నించాడు హర్షా భోగ్లే...

Image Credit: Getty Images

దానికి ‘ఈ టీమ్‌ని ఇలా వదిలేయలేను... నాలో ఇంకా సత్తా ఉందనే అనుకుంటున్నా...’ అంటూ ఎమ్మెస్ ధోనీ చెప్పిన సమాధానంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. 

2022 సీజన్‌లో అయితే సీఎస్‌కేలో చాలా పెద్ద హై డ్రామానే నడిచింది. సీజన్ ఆరంభానికి ముందు ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం జడ్డూ కెప్టెన్‌గా సీజన్ ప్రారంభమవ్వడం, వరుస పరాజయాలతో జడేజా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం... తిరిగి ధోనీ కెప్టెన్‌గా మారడం... ఇలా చెన్నై సూపర్ కింగ్స్‌కి 2022 సీజన్ వింత అనుభవాలను మిగిల్చింది...

Image credit: PTI

ఇక ఎమ్మెస్ ధోనీ రిటైర్మెంట్ తీసుకుంటాడని భావిస్తున్న సమయంలో ఐపీఎల్ 2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆఖరి మ్యాచ్‌లో మరోసారి ఈ వార్తలను తన స్టైల్‌లో కొట్టిపారేశాడు...
 

‘వచ్చే సీజన్‌లో ఆడతారా?’ అంటూ ఇయాన్ బిషప్ అడిగిన ప్రశ్నకు ‘డెఫినెట్‌లీ యస్... ఇంత క్రికెట్ ఆడిన తర్వాత చెన్నైలో మ్యాచ్ ఆడకుండా, చెన్నై ప్రజలకు థ్యాంక్యూ చెప్పకుండా వెళ్లిపోతే... అది కరెక్ట్ ఎండింగ్ కాదు...’ అంటూ మాహీ చెప్పిన సమాధానంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు...

click me!