‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ తర్వాత క్రికెట్ వరల్డ్‌ని ఏలిన మకుఠం లేని మహారాజు ‘కింగ్’ విరాట్ కోహ్లీ... అయితే దశాబ్దంన్నర పాటు పరుగుల ప్రవాహం పారించిన ఈ రన్ మెషిన్... ఇప్పుడు కాస్త నెమ్మదించింది...
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా 7 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ, రెండు సార్లు రనౌట్ అయ్యాడు. కేవలం 19.83 సగటుతో 119 పరుగులు మాత్రమే చేయగలిగాడు...
210
నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విరాట్ కోహ్లీ, బ్యాటింగ్‌లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ...
310
విరాట్ బ్యాటు నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తుందని, ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. రెండున్నరేళ్లుగా సెంచరీ అందుకోలేకపోయిన విరాట్, తన మార్కు ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోయాడు...
410
కోహ్లీ పరుగుల వరద పారించినప్పుడు ‘కింగ్’ కోహ్లీ, ‘రన్ మెషిన్’ అంటూ పొడిగిన నోళ్లే, ఇప్పుడు విరాట్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఇక రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అంటూ సలహాలు కూడా ఇస్తున్నాయి...
510
తాజాగా భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ ఫామ్ గురించి స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ బాగా అలిసిపోయినట్టు కనిపిస్తున్నాడు. అతనికి విశ్రాంతి అవసరం. విరాట్ బ్రేక్ తీసుకుని, కమ్‌బ్యాక్ ఇవ్వాలి...’ అంటూ కామెంట్ చేశాడు సునీల్ గవాస్కర్...
610
‘అవును, సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్లతో నేను నూరు శాతం అంగీకరిస్తున్నారు. పెళ్లి, పిల్లలు, మీడియా, కెప్టెన్సీ రాజీనామా.. కారణాలేమైతేనేమీ విరాట్ బాగా అలిసిపోయాడు. అతనికి విశ్రాంతి అవసరం...
710
దాదాపు ఆరు నెలల పాటు క్రికెట్ బూట్స్‌ని పక్కనబెట్టేస్తే బెటర్. సోషల్ మీడియాకి దూరంగా వెళ్లి, మళ్లీ కొత్తగా, రెట్టింపు ఉత్సాహంతో రీఎంట్రీ ఇస్తే చూడాలని ఉంది...
810
మళ్లీ స్టేడియాల్లో జనం నిండుగా కనిపిస్తున్నప్పుడు విరాట్ షో చూడాలని అనుకుంటున్నా... విరాట్ ఎప్పుడు తప్పుకున్నా, అతనికి జట్టులో చోటు తప్పకుండా ఉంటుంది...
910
మరో ఏడాది, రెండేళ్లు... మూడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ ఆడాలని అనుకున్నా... టీమిండియా సాదరంగా ఆహ్వానిస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కేవిన్ పీటర్సన్...
1010
ఆర్‌సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ మాత్రం... విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి ఓ భారీ ఇన్నింగ్స్ త్వరలోనే రాబోతుందని, దాన్ని ఎంజాయ్ చేసేందుకు ఆశగా ఎదురుచూస్తున్నానని కామెంట్ చేయడం విశేషం.