ఐపీఎల్‌లో వరుసగా 500+ పరుగులు చేస్తూ అదరగొడుతున్న భారత బ్యాటర్ శిఖర్ ధావన్. ఆరెంజ్ క్యాప్ రేసులో నిలుస్తున్న శిఖర్ ధావన్, 2020 సీజన్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదాడు. 2021 ఐపీఎల్‌లో 587 పరుగులు చేసిన ధావన్, టీ20 వరల్డ్ కప్ 2021 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...
ఐపీఎల్‌లో వరుసగా 500+ పరుగులు చేస్తూ అదరగొడుతున్న భారత బ్యాటర్ శిఖర్ ధావన్. ఆరెంజ్ క్యాప్ రేసులో నిలుస్తున్న శిఖర్ ధావన్, 2020 సీజన్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదాడు. 2021 ఐపీఎల్‌లో 587 పరుగులు చేసిన ధావన్, టీ20 వరల్డ్ కప్ 2021 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...
210
ఓపెనర్లుగా కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేసిన సెలక్టర్లు, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ని స్ట్రైయిక్ రేటు తక్కువగా ఉందనే వంకతో పక్కనబెట్టారు...
310
గత మూడు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడిన శిఖర్ ధావన్, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో కచ్చితంగా ఉంటానని ఆశపడ్డాడట. ఈ విషయాన్ని బయటపెట్టాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...
410
‘మేం గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంపులో ఓ ప్రాక్టీస్ గేమ్ ఆడుతున్నాం. శిఖర్ ధావన్ స్ట్రైయిక్‌లో ఉన్నాడు. మార్నస్ స్టోయినిస్ బౌలింగ్ చేస్తున్నాడు.
510
నేను అంపైర్‌గా ఉన్నా. శిఖర్ ధావన్ సింగిల్ తీసి, మరో ఎండ్‌కి రాగానే... ఫీల్డ్ ప్లేస్‌మెంట్ ఏమైనా మార్చవంటావా? ఫైన్ లెగ్ పెట్టనా? నీకు ఎలాంటి ఫీల్డ్ ప్లేస్‌మెంట్ కావాలని స్టోయినిస్, అడిగాడు...
610
దానికి శిఖర్ ధావన్... నువ్వు బాగా ఫీల్డ్ సెట్ చేశావు. అదే ఉండనివ్వు అని సమాధానం ఇచ్చాడు. అంపైరింగ్ చేస్తున్న నా వైపు తిరిగి... ‘అతనికి నా వీక్‌నెస్ ఎందుకు చెప్పాలి...
710
యూఏఈలో టీ20 వరల్డ్ కప్ ఆడబోతున్నాం. నా వీక్‌నెస్‌ని ప్రత్యర్థి బౌలర్లకు ఎందుకు చెప్పడం...’ అన్నాడు శిఖర్ ధావన్... ఒకే టీమ్‌కి ఆడుతున్నా బౌలర్లతో వీక్‌నెస్ షేర్ చేసుకోవడానికి బ్యాటర్లు ఇష్టపడరు.
810
తనకి ఎలాంటి ఫీల్డ్ ప్లేస్‌మెంట్ కావాలో కూడా చెప్పడానికి ఇష్టపడరు. స్మార్ట్ బ్యాటర్ల ఆలోచన అలా ఉంటుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు మహ్మద్ కైఫ్...
910
‘స్టోయినిస్, శిఖర్ ధావన్ చాలా మంచి స్నేహితులు. చాలా విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆట విషయానికి వచ్చేసరికి పక్కా ప్రొఫెషనల్...
1010
శిఖర్ ధావన్ అందరితో సరదాగా ఉంటాడని, అందరితో కలిసిపోతాడని అనుకుంటారంతా. అయితే తనలో ఓ ప్రాసెస్, ప్లానింగ్, స్మార్ట్‌నెస్ పుష్కలంగా ఉన్నాయి...’ అంటూ కామెంట్ చేశాడు మహ్మద్ కైఫ్...