జోఫ్రా ఆర్చర్ ఒక్కడు వస్తే ముంబై ఇండియన్స్ మళ్లీ టాప్ టీమ్ అవుతుందా... సీఎస్‌కేలోకి చాహార్ వస్తే...

First Published May 18, 2022, 6:58 PM IST

ముంబై ఇండియన్స్, గత 9 సీజన్లలో 5 సార్లు టైటిల్ గెలిచిన టాప్ టీమ్... చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్. 4 సార్లు టైటిల్ గెలిచిన సీఎస్‌కే, 9 సార్లు ఫైనల్ ఆడింది. అయితే ఇప్పుడు ఈ రెండు జట్లూ 2022 సీజన్‌లో ఆఖరి పొజిషన్స్‌లో నిలిచాయి...

ఐపీఎల్ 2022 సీజన్‌కి ఆశించిన స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ రాకపోవడానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు సరిగా ఆడకపోవడమే కారణం...

దీంతో ఈ రెండు జట్లు కనీసం వచ్చే సీజన్‌లో అయినా తిరిగి విజయాల బాట పట్టడం ఆ రెండు ఫ్రాంఛైజీలకు మాత్రమే కాదు, ఐపీఎల్‌కి కూడా చాలా అవసరం. అయితే ఇద్దరు ప్లేయర్లు చేరితే, ఈ రెండుజట్లూ మళ్లీ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇస్తాయా?

Latest Videos


ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్‌ని రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. గాయం కారణంగా 2022 సీజన్‌కి అందుబాటులో ఉండడని తెలిసినా, అతని కోసం భారీగా ఖర్చు చేసింది...

జోఫ్రా ఆర్చర్ వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టులో కలిస్తే బుమ్రాతో కలిసి ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టడం గ్యారెంటీ. అయితే ముంబై సమస్య బౌలింగ్ మాత్రమే కాదు...

ఈ సీజన్‌లో రోహిత్ శర్మతో పాటు రూ.15.25 కోట్లు పోసి కొన్న ఇషాన్ కిషన్ కూడా బాగా ఆడలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ తన స్టైల్‌లో రాణించినా గాయం కారణంగా సగం మ్యాచులు కూడా ఆడలేదు...

ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌కి మ్యాచ్ ఫినిషర్‌గా ఉండే కిరన్ పోలార్డ్, ఈసారి అస్సలు ఫామ్‌లో లేడు. మరో మ్యాచ్ ఫినిషర్ హార్ధిక్ పాండ్యా వేరే జట్లుకి వెళ్లాడు. కాబట్టి ముంబై మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే చాలా మార్పులు జరగాలి...

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఇలాగే ఆడితే... టాపార్డర్‌లో పరుగులు రావడం కష్టం. కిరన్ పోలార్డ్ ఫామ్‌లోకి రాకపోయినా వారికి టిమ్ డేవిడ్ రూపంలో ఓ ఫినిషర్ దొరికినట్టే. అతన్ని సరిగ్గా వాడుకోవాల్సిన అవసరం ఉంది...

ఫైవ్ టైమ్ ఛాంపియన్ టీమ్, మాకు స్టార్ ప్లేయర్లతో సంబంధం లేదని కాస్త ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో మెగా వేలంలో వ్యవహరించిన ముంబై ఇండియన్స్, దానికి ఈ సీజన్‌లో భారీ మూల్యమే చెల్లించుకుంది. ఈసారి ఎలాంటి మార్పులతో వస్తుందనేది ఆ జట్టు విజయావకాశాలను డిసైడ్ చేయనుంది...

అలాగే మెగా వేలంలో రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చాహార్ గాయం కారణంగా తప్పుకోవడంతో భారీగా నష్టపోయామని చెప్పుకొచ్చింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే పవర్ ప్లేలో వికెట్లు తీసే దీపక్ చాహార్ ఒక్కడు ఉంటే, సీఎస్‌కే టైటిల్ గెలిచేదా?
 

దీపక్ చాహార్ స్థానంలో జట్టులోకి వచ్చిన ముకేశ్ చౌదరి బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. బాగానే వికెట్లు తీశాడు, అయితే దీపక్ చాహార్‌తో తోడుగా ఉండే శార్దూల్ ఠాకూర్ లాంటి ఆల్‌రౌండర్‌ని మిస్ చేసుకుంది సీఎస్‌కే... డెత్ ఓవర్లలో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పడం శార్దూల్ స్పెషాలిటీ...

సామ్ కుర్రాన్, ఫాఫ్ డుప్లిసిస్ వంటి బ్యాటర్లు కూడా ఇప్పుడు ఆ జట్టులో లేరు. అంబటి రాయుడు, డీజే బ్రావో వంటి సీనియర్లను నమ్ముకున్న చెన్నై, ఎన్ని సీజన్లు వారి నుంచి టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌లు ఆశించగలదు?

ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టే రవీంద్ర జడేజా కెప్టెన్సీ కారణంగా ఫామ్ కోల్పోవడంతో పాటు మొయిన్ ఆలీ, మిచెల్ సాంట్నర్, డ్వేన్ ప్రిటోరియస్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు...

అన్నింటి కంటే ముఖ్యంగా కెప్టెన్‌గా అద్భుతాలు చేయగలను, ఫినిషర్‌గా ఎలాంటి మ్యాచులనైనా ముగించగలననే ఎమ్మెస్ ధోనీ వయసు పైబడింది. కాబట్టి ముంబై ఇండియన్స్‌తో పాటు సీఎస్‌కే కూడా వచ్చే సీజన్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే సమూల మార్పులకు శ్రీకారం చుట్టాల్సిందే... 

click me!