అతడిలో ఉన్న గొప్ప లక్షణం అదే.. కానీ ఇంకా కష్టపడాలి.. : ఉమ్రాన్ మాలిక్ పై విండీస్ దిగ్గజం ప్రశంసలు

Published : May 18, 2022, 05:35 PM IST

Umran Malik: ఈ ఐపీఎల్ సీజన్ లో నిలకడగా రాణిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ పై వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఇయాన్ బిషప్ ప్రశంసలు కురిపించాడు. 

PREV
17
అతడిలో ఉన్న గొప్ప లక్షణం అదే.. కానీ ఇంకా కష్టపడాలి.. : ఉమ్రాన్ మాలిక్ పై విండీస్ దిగ్గజం  ప్రశంసలు

సన్ రైజర్స్ హైదరాబాద్ యువ  పేసర్ ఉమ్రాన్ మాలిక్ పై  విండీస్ మాజీ దిగ్గజం, ప్రస్తుతం ఐపీఎల్ లో తన కామెంట్రీతో టీవీలలో మ్యాచులను చూస్తున్న ప్రేక్షకులకు మరింత ఉత్సాహాన్ని పంచుతున్న ఇయాన్ బిషప్ ప్రశంసలు కురిపించాడు. 
 

27

మంగళవారం ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ అనంతరం  బిషప్ మాట్లాడుతూ.. ‘ఉమ్రాన్ వేగమే అతడిని ఇతర బౌలర్ల నుంచి ప్రత్యేకించి చూపెడుతున్నది. ఈ ఐపీఎల్ లో అతడి బౌలింగ్ విన్యాసాలను చూడటం సంతోషంగా ఉంది. 

37

అతడు ఒక్క వేగానికే పరిమితం కాకుండా బంతిపై నియంత్రణను కూడా పెంచుకున్నాడు. దానికి కాస్త  టెక్నిక్ ను కూడా జతచేస్తున్నాడు. అతడు ఏదైనా త్వరగా నేర్చుకునే స్వభావం ఉన్నవాడు... 
 

47

ఆధునిక క్రికెట్ లో బ్యాటర్ల హవా పెరిగిపోయింది. వాళ్లు తమ పవర్ తో  బౌండరీలు బాదినప్పుడో సిక్సర్లు కొట్టినప్పుడో ఉమ్రాన్ కుంగిపోవడం లేదు.  మరింత పట్టుదలతో బౌలింగ్ చేస్తున్నాడు. అదే అతడిలో ఉన్న గొప్ప లక్షణం.  

57

కింద పడిన ప్రతిసారి లేవడం  నేర్చుకుంటున్న ఉమ్రాన్ మాలిక్.. చాలా కష్టపడుతున్నాడు.  ఆ లక్షణం అతడిని మరింత ఉన్నత బౌలర్ గా తీర్చిదిద్దుతుంది. అయితే బ్యాటర్లు.. బౌలర్లపై తమ ప్రతాపం చూపించినప్పుడు  బౌలర్లు  ఆ మ్యాచ్  వరకే దానిని మరిచిపోవాలి. 

67

అదే విషయాన్ని గుర్తుంచుకోని తలుచుకుని బాధపడితే  అది వాళ్ల కెరీర్ మీద ప్రభావం చూపే ప్రమాదముంది. ఒక చెత్త ఓవర్ వేసినప్పుడో.. చెత్త మ్యాచ్ ఎదురైనప్పుడో దానిని అక్కడే మరిచిపోయి వేరే మ్యాచ్  కు సిద్ధం కావాలి.  అయితే ఉమ్రాన్ ఇంకా చిన్నవాడే. నేర్చుకునే దశలోనే ఉన్నాడు.  అతడింకా మెరుగవ్వాలి. ప్రస్తుతానికి  అతడు ఫినిష్ అవడానికి ఉన్న ఒక ఆర్టికల్ లా ఉన్నాడు...’  అని వ్యాఖ్యానించాడు. 

77

మంగళవారం  ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో  తన తొలి ఓవర్ లో  20 పరుగులిచ్చిన  ఉమ్రాన్.. తర్వాత రెండు ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి  మూడు కీలక వికెట్లు తీశాడు. ఇక మొత్తంగా ఈ ఐపీఎల్ సీజన్ లో  13 మ్యాచులలో 20 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన  బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. 

click me!

Recommended Stories