విరాట్ కోహ్లీ కోసం ఈసారి ఆర్‌‌సీబీ గెలవాలి... ఐపీఎల్ 2022 విజేతపై సురేష్ రైనా కామెంట్...

Published : May 24, 2022, 04:13 PM IST

ఐపీఎల్‌లో 15 సీజన్లుగా టైటిల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నవారిలో విరాట్ కోహ్లీ ఒకడు. ఆఖరికి ఛతేశ్వర్ పూజారా కూడా గత ఏడాది ఐపీఎల్ విన్నింగ్ టీమ్‌లో చోటు దక్కించుకోగా, విరాట్ మాత్రం మొదటి నుంచి ఆర్‌సీబీలో ఉండడంతో ఆ ఆశ నెరవేరలేదు...

PREV
17
విరాట్ కోహ్లీ కోసం ఈసారి ఆర్‌‌సీబీ గెలవాలి... ఐపీఎల్ 2022 విజేతపై సురేష్ రైనా కామెంట్...

ఐపీఎల్ 2016లో కెప్టెన్‌గా ఆర్‌సీబీని ఫైనల్ చేర్చిన విరాట్ కోహ్లీ, టైటిల్ మాత్రం గెలవలేకపోయాడు. అంతకుముందు 2009, 2011 సీజన్‌లోనూ ఆర్‌సీబీ ఫైనల్ చేరినా టైటిల్ మాత్రం సాధించలేకపోయింది....

27

చెన్నై సూపర్ కింగ్స్ 11 సార్లు, ముంబై ఇండియన్స్ 9 సార్లు తర్వాత అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన జట్టుగా నిలిచింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (8 సార్లు)... 

37
Image credit: PTI

గత మూడు సీజన్లలో ప్లేఆఫ్స్ చేరిన ఏకైక జట్టుగా నిలిచింది ఆర్‌సీబీ. గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్, ఈసారి ఆ ఫీట్ సాధించలేకపోయింది. సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ జట్లు కూడా ఈసారి ప్లేఆఫ్స్‌కి చేరలేకపోయాయి...

47

ఈసారి ఆర్‌సీబీ టైటిల్ గెలవాలని కొన్ని కోట్ల మంది అభిమానులు కోరుకుంటున్నారు. వారిలో తాను కూడా ఒకడినని అంటున్నాడు సీఎస్‌కే మాజీ క్రికెటర్ ‘చిన్నతలా’, ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా...

57

‘ఈ ఏడాది ఆర్‌సీబీ ఎలాగైనా టైటిల్ గెలవాలని నేను బలంగా కోరుకుంటున్నా... ఎందుకంటే విరాట్ కోహ్లీ కోసం. కోహ్లీ, ఐపీఎల్ ట్రోఫీ లిఫ్ట్ చేయడం చూడడం కోసం...’ అంటూ కామెంట్ చేశాడు సురేష్ రైనా...

67

ఈ సీజన్‌లో 300+ పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక సీజన్లలో వరుసగా 300+ పరుగులు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు. ఇంతకుముందు సురేష్ రైనా, శిఖర్ ధావన్ 12 సార్లు ఈ ఫీట్ సాధించగా విరాట్ కోహ్లీకి ఇది వరుసగా 13వ సారి... 

77

అలాగే గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో 14వ సారి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచి, రైనా రికార్డును సమం చేశాడు.. 

Read more Photos on
click me!

Recommended Stories