IPL 2022: 2020 ఐపీఎల్ సీజన్ వరకు తన అందచందాలతో, మత్తెక్కించే వయ్యారాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన హాట్ యాంకర్ మళ్లీ వచ్చేస్తుంది. రెండేండ్ల గ్యాప్ తర్వాత అభిమానులకు ఆటలో అందాల విందును పంచడానికి తిరిగి మైక్ అందుకోనుంది.
మరో ఐదు రోజుల్లో మొదలుకానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో యువతను తన అందచందాలతో ముద్దు ముద్దు మాటలతో మత్తెక్కించడానికి రెడీ అవుతున్నది మయంతి లంగర్..
28
ప్రెగ్నెన్సీ కారణంగా రెండు సీజన్ల పాటు ఐపీఎల్ కు దూరంగా ఉన్న ఈ హాట్ యాంకర్.. ఇప్పుడు మళ్లీ మెరవనున్నది. ఐపీఎల్ 2022 సందర్బంగా కామెంటేటర్లతో హంగామా చేసేందుకు మయంతి కూడా రానున్నట్టు సమాచారం.
38
స్టార్ ఇండియా నెట్వర్క్ తో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మయంతి.. 2020 సీజన్ కు ముందు విశ్రాంతి తీసుకుంది. ఆ సీజన్ కు ముందు ఆమె గర్భవతి అయింది. దీంతో 2020 సీజన్ తో పాటు 2021 ఐపీఎల్ లో కూడా ఆమె కనిపించలేదు.
48
అయితే ప్రసూతి సెలవులు ముగియడంతో పాటు ప్రస్తుతం ఆమె కొడుకు కూడా ఏడాది దాటడంతో మయంతి తిరిగి గ్రౌండ్ లో అందాలు ఆరబోయడానికి సిద్ధమవుతున్నది.
58
ఐపీఎల్ ప్రసారాల కోసం 80 మంది కామెంటేటర్లను నియమించుకున్న స్టార్ నెట్వర్క్.. తన అధికారిక జాబితాలో మయంతి పేరును చేర్చకపోయినా ప్రెజెంటర్ల జాబితాలో ఆమె పేరు ఉందని సోషల్ మీడియా కోడై కూస్తుంది.
68
మయంతి రాకతో ఈ ఏడాది ఐపీఎల్ కు మరింత గ్లామర్ రానున్నది. మయంతి విరామంతో వెలుగులోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్.. ఈ రెండేండ్లలో తన అందచందాలతో పాట వాక్చాతూర్యంతో కూడా జనాలను ఆకట్టుకుంది.
78
ఈసారి సంజనాతో పాటు మరో ఐదుగురు కూడా ఐపీఎల్ లో ప్రెజెంటర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వీరిలో మయంతి కూడా ఒకరు.
88
మయంతి వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. భారత క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ ని 2012లో వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కూడా ఆమె క్రికెట్ లో ప్రెజెంటర్ గా పని చేసింది. తన అందచందాలతో క్రికెట్ కు గ్లామర్ సొబగులను అద్దింది. 2020లో ఈ జంటకు బాబు పుట్టాడు.