రోహిత్ శర్మ అంత మంచోడంటే, విరాట్ కోహ్లీ కాదా... శిఖర్ ధావన్ కామెంట్లపై సోషల్ మీడియాలో రచ్చ...

Published : Mar 21, 2022, 05:53 PM IST

పెద్ద కొడలు మంచిది అంటే... చిన్న కొడలు మంచిది కాదనేగా! ఈ తెలుగు సామెత ఇప్పుడు క్రికెట్‌కి కూడా వర్తిస్తుంది. భారత జట్టుకి అద్భుత విజయాలు అందించిన విరాట్ కోహ్లీ, ఆ పదవి నుంచి తప్పుకున్న తర్వాత నయా సారథిగా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే... 

PREV
110
రోహిత్ శర్మ అంత మంచోడంటే, విరాట్ కోహ్లీ కాదా... శిఖర్ ధావన్ కామెంట్లపై సోషల్ మీడియాలో రచ్చ...

కెరీర్ మొదలెట్టిన తర్వాత 14 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా ప్రమోషన్ పొందాడు రోహిత్ శర్మ. 32 ఏళ్ల వయసులో టీమిండియాకి మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా నియమితుడైన రోహిత్, తన కెప్టెన్సీ ప్రస్థానాన్ని ఘనంగా ప్రారంభించాడు. వరుసగా 14 మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంది టీమిండియా...

210

టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవడానికి ముందే ముంబై ఇండియన్స్‌కి సారథిగా ఐదు టైటిల్స్ అందించాడు రోహిత్ శర్మ. ఐపీఎల్ కెప్టెన్సీ కారణంగానే రోహిత్‌కి టీమిండియా కెప్టెన్సీ దక్కింది...

310

టీమిండియా నయా సారథి రోహిత్ శర్మ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్... ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. 

410

‘రోహిత్ శర్మ రత్నంలాంటి మనిషి. అతను ఎంతో రిలాక్స్‌గా ఉంటాడు, అందరిలో ఈజీగా కలిసిపోతాడు. అంతకుమించి స్మార్ట్ పర్సన్... 

510

రోహిత్‌‌తో ఏ విషయం గురించైనా ఈజీగా మాట్లాడొచ్చు... మిగిలిన కెప్టెన్లతో పోలిస్తే రోహిత్‌లో ఈ క్వాలిటీ చాలా స్పెషల్. ఆటను రోహిత్ చాలా చక్కగా అర్థం చేసుకుంటాడు...

610

రోహిత్ ఇప్పుడు కెప్టెన్ అయ్యి ఉండొచ్చు కానీ ఇంతకుముందు ఎలా ఉండేవాడో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. అతనిలో ఎలాంటి మార్పు రాలేదు....

710

రోహిత్ ఎప్పుడూ సాయం చేసేందుకు సిద్దంగా ఉంటాడు. అన్నింటికీ అతను మెసేజ్‌ను చెప్పే విధానం చాలా బాగుంటుంది. ఎవ్వరినీ నొప్పించకుండా మెసేజ్‌ ఎలా పాస్ చేయాలో రోహిత్‌కి బాగా తెలుసు...’ అంటూ కామెంట్ చేశాడు శిఖర్ ధావన్...

810

రోహిత్‌ని ఈజీగా కలవచ్చు, ఈజీగా ఏదైనా చెప్పొచ్చు... అతనికి ఏ విషయాన్ని ఎలా చెప్పాలో బాగా తెలుసుని శిఖర్ ధావన్ చేసిన కామెంట్లు... విరాట్ కోహ్లీ ఇవేమీ తెలియవని, అతన్ని కలవడం చాలా కష్టమనేలా ఉన్నాయంటున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్...

910

కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ కలిసి టీమిండియాలో ఓ యూనిట్‌గా మారి, ప్లేయర్ల మాటలను వినడం లేదని, వారి సమస్యలను పట్టించుకోవడం లేదనే వాదనలు వచ్చాయి. ఇప్పుడు గబ్బర్ కామెంట్లను బట్టి చూస్తే, అవే నిజమేనేమోననే అనుమానాలు కూడా కలుగుతున్నాయి...

1010

36 ఏళ్ల శిఖర్ ధావన్, ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడబోతున్నాడు. గత ఐదు సీజన్లుగా నిలకడైన పర్ఫామెన్స్ ఇస్తున్న శిఖర్ ధావన్‌ను మెగా వేలంలో రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్...

Read more Photos on
click me!

Recommended Stories