అతడు వేలంలోకి వస్తే బాక్సులు బద్దలవ్వాల్సిందే.. టీమిండియా ఓపెనర్ కు 20 కోట్లు ఖాయమంటున్న ఆకాశ్ చోప్రా

Published : Nov 20, 2021, 04:30 PM IST

KL Rahul: కొద్దిరోజులుగా టీమిండియాలో మూడు ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న  భారత ఓపెనర్ కెఎల్ రాహుల్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఐపీఎల్ వేలంలో అతడు ఓ హాట్ కేక్ అని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. 

PREV
110
అతడు వేలంలోకి వస్తే బాక్సులు బద్దలవ్వాల్సిందే.. టీమిండియా ఓపెనర్ కు 20 కోట్లు ఖాయమంటున్న ఆకాశ్ చోప్రా

గత కొన్నేళ్లుగా ఐపీఎల్ తో పాటు టీమిండియాలోనూ స్థిరంగా రాణిస్తున్న ఓపెనర్ కెఎల్ రాహుల్ పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురపించాడు. వచ్చే ఐపీఎల్ లో అతడు  ఫ్రాంచైజీలకు హాట్ కేకు అవుతాడంటూ అంచనా వేశాడు. 

210

ఇప్పటికే ఐపీఎల్ లో పంజాబ్ సూపర్ కింగ్స్  తరఫున సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాహుల్.. వచ్చే ఏడాది ఆ జట్టును వీడే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై రాహుల్ గానీ, పంజాబ్ యాజమాన్యం గానీ ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

310

అయితే  పంజాబ్ ను వీడాలనుకుంటున్న రాహుల్ ను ఇప్పటికే ఇతర ఫ్రాంచైజీలు మాట్లాడాయని.. బెంగళూరు గానీ లేదా త్వరలో చేరబోయే రెండు కొత్త ఫ్రాంచైజీలలో ఏదో ఒకదాన్లో రాహుల్ చేరే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. 

410

కాగా ఇదే విషయమై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆకాశ్ చోప్రా..‘ఒకవేళ కెఎల్ రాహుల్ వేలంలోకి వస్తే.. ఆటగాళ్ల వేతనంపై సీలింగ్ లేకుంటే వచ్చే ఐపీఎల్ వేలంలో అతడు (రాహుల్)  అత్యధిక ధర వెచ్చించి కొనుక్కునే ప్లేయర్ అవుతాడు.

510

ఆ ధర  రూ. 20 కోట్లున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. ’ అని ట్వీట్ చేశాడు. టీమిండియా తరఫున ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో చివరి మూడు మ్యాచుల్లో రాణించిన రాహుల్..  స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్ లో కూడా అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్ లో అత్యధిక ధర  పెట్టి దక్కించుకున్న ఆటగాడు క్రిస్ మోరిస్. (2021 లో రాజస్థాన్ రాయల్స్ అతడిని  భారీ మొత్తం పెట్టి కొన్నది)

610

2018లో పంజాబ్.. వేలంలో రాహుల్ ను రూ. 11 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఈ నాలుగేండ్లలో సారథిగా విఫలమైనా.. ఆటగాడిగా మాత్రం రాహుల్ ఆకట్టుకున్నాడు.

710

వరుస సీజన్లలో659, 593, 650, 626 పరుగులతో  లీగ్ లో అదరగొట్టాడు. 2020 ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ అతడికే దక్కింది. గత  సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో  మూడో స్థానంలో ఉన్నాడు.

810

భారత జట్టుకు నిలకడగా రాణించడంతో పాటు ఇటీవలే రాహుల్..  భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ గా కూడా నియమితుడయ్యాడు. ఇది కూడా రాహుల్  బ్రాండ్ వాల్యూను పెంచేదే. 

910

ఇప్పటివరకు ప్రతి సీజన్లో అత్యధిక దర పలికిన ఆటగాళ్లు : 2008లో  ఎంఎస్ ధోని (సీఎస్కే- రూ. 8 కోట్లు), 2009లో పీటర్సన్ (ఆర్సీబీ- రూ. 9.8 కోట్లు), 2010లో షేన్ బాండ్ (కేకేఆర్- రూ. 4.8 కోట్లు), 2011 లో గౌతం గంభీర్ (కేకేఆర్- రూ. 14.9 కోట్లు), 2012లో జడేజా (సీఎస్కే- రూ. 12.8 కోట్లు), 2013 లో గ్లెన్ మ్యాక్స్వెల్ (ముంబై- రూ. 6.3 కోట్లు), 2014లో యువరాజ్ సింగ్ (ఆర్సీబీ రూ. 14 కోట్లు). 

1010

2016లో షేన్ వాట్సన్ (ఆర్సీబీ- రూ.  9.5 కోట్లు), 2017 లో బెన్ స్టోక్స్ (ఆర్పీఎస్-రూ. 14.5 కోట్లు), 2018లో  బెన్ స్టోక్స్ (రాజస్థాన్- రూ. 12.5 కోట్లు), 2019 లో జయదేవ్ ఉనద్కత్ (రాజస్థాన్ రూ. 8.4 కోట్లు), 2020 లో పాట్ కమిన్స్ (కేకేఆర్-రూ. 15.5 కోట్లు), 2021 లో క్రిస్ మోరిస్ (రాజస్థాన్- రూ. 16.25 కోట్లు) 

click me!

Recommended Stories