అతన్ని బాగా మిస్ అవుతున్నా! త్వరలోనే వస్తాడు ... ఏబీ డివిల్లియర్స్ రీఎంట్రీపై హింట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ...

First Published May 12, 2022, 4:46 PM IST

ఏబీ డివిల్లియర్స్, సురేష్ రైనా, క్రిస్ గేల్... ఐపీఎల్‌కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఈ ముగ్గురే. అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లొ ఈ ముగ్గురూ బరిలో దిగలేదు. క్రిస్ గేల్ మెగా వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు, సురేష్ రైనాని వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. ఏబీ డివిల్లియర్స్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు..

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి చాలా రోజుల ముందు ఏబీ డివిల్లియర్స్, ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు... ఆరంభ సీజన్ నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఫారిన్ ప్లేయర్లలో ఏబీ డివిల్లియర్స్ ఒకడు...
 

2008 నుంచి 2010 సీజన్ల వరకూ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కి ఆడిన ఏబీ డివిల్లియర్స్, 2011లో ఆర్‌సీబీకి మారి ఆ జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా మారాక వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు ఏబీడీ...

కోహ్లీకి ఆప్తమిత్రుడైన ఏబీ డివిల్లియర్స్, విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగానే ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం విశేషం...

ఏబీ డివిల్లియర్స్ లేకుండా చాలా ఏళ్ల తర్వాత ఐపీఎల్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. 11 మ్యాచుల్లో కలిపి 216 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

‘నేను ఏబీడీని చాలా మిస్ అవుతున్నా. అతనితో రోజూ మాట్లాడుతూనే ఉంటాను. ప్రతీ విషయం షేర్ చేసుకుంటూనే ఉంటాను.. ఏబీడీ కూడా నాకు మెసేజ్ చేస్తూనే ఉంటాడు...

ఏబీ డివిల్లియర్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాను. అతను ఆర్‌సీబీ మ్యాచులన్నీ చూస్తున్నాడు. వచ్చే సీజన్‌లో ఏదో ఒక ప్లేస్‌లో ఏబీ డివిల్లియర్స్‌... ఐపీఎల్‌కి వస్తాడని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

ఐపీఎల్ 2022 సీజన్‌లోనే బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా ఏబీ డివిల్లియర్స్, ఆర్‌సీబీ క్యాంపులోకి రీఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఏబీ డివిల్లియర్స్, ప్రొఫెషనల్ లైఫ్ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో అది సాధ్యం కాలేదని సమాచారం...

AB de Villiers

ఐపీఎల్‌లో 184 మ్యాచుల్లో 5162 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్, 150+ యావరేజ్‌తో బెస్ట్ ఫినిషర్‌గా ఉన్నాడు. వికెట్ కీపర్‌గా 118 క్యాచులు అందుకున్నాడు...

click me!