భారత్, పాకిస్తాన్ దేశాలు కలిసి ద్వైపాక్షిక సిరీస్‌లే ఆడడం మానేసి దాదాపు దశాబ్దం కావస్తోంది. అలాంటి ఈ దాయాది దేశాల క్రికెటర్లు కలిసి ఆడుతుంటే చూసే అవకాశం దక్కుతుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అయితే కౌంటీ ఛాంపియన్‌షిప్ కారణంగా ఆ అదృష్టం దక్కింది క్రికెట్ ఫ్యాన్స్...
భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా, పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ కలిసి కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022 టోర్నీలో సుసెక్స్ క్లబ్ తరుపున ఆడుతున్న విషయం తెలిసిందే...
29
ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, రెండు సెంచరీలతో 717 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు ఛతేశ్వర్ పూజారా...
39
కౌంటీకి ముందు టీమిండియా తరుపున దాదాపు మూడేళ్లుగా సెంచరీ చేయలేకపోయిన ఛతేశ్వర్ పూజారా, ఈ సీజన్‌లో నాలుగు మ్యాచుల్లోనూ నాలుగు సెంచరీలు చేసి.. అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు...
49
Mohammad Rizwan
అయితే భారీ అంచనాలతో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అడుగుపెట్టిన పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వరుస వౌఫల్యాల తర్వాత డుర్హమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పూజారాతో కలిసి 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రిజ్వాన్...
59
ఛతేశ్వర్ పూజారా 203 పరుగులతో అదరగొడితే, మహ్మద్ రిజ్వాన్ 79 పరుగులతో సీజన్‌లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. దీనికి ముందు 22, 0, 4 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు రిజ్వాన్...
69
‘ఈ సీజన్‌లో నేను దీనికి ముందు మ్యాచుల్లో చాలా త్వరగా అవుట్ అయ్యాను. అందుకే పూజారా దగ్గరికి వెళ్లి, సలహాలు అడిగాను. ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పారు, అమూల్యమైన సలహాలు ఇచ్చారు...
79
శరీరానికి దగ్గరగా ఆడమని పూజారా చెప్పారు. మేం ఈ మధ్య వైట్ బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడుతున్నాం. కాబట్టి శరీరానికి దూరంగా బ్యాటింగ్ చేయడం అలవాటైపోయింది. అయితే రెడ్ వైల్ క్రికెట్‌లో అలా కాదు...
89
కౌంటీల్లోకి వచ్చిన తర్వా తనేను కూడా శరీరానికి దూరంగా ఆడి అవుట్ అయ్యా. పూజారాతో మాట్లాడిన తర్వాత శరీరానికి దగ్గరగా ఆడడంపై ఫోకస్ పెట్టా. రిజల్ట్ వచ్చింది...
99
ఆసియాలో పిచ్‌ల్లో ఆడేటప్పుడు డ్రైవ్ చేయడానికి మేం బాల్‌ని ఫోర్స్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అలాంటివేమీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం దానికి మార్గం చూపిస్తే చాలు... పూజారా చెప్పిన ఈ సలహా నాకెంతో హెల్ప్ అయ్యింది... థ్యాంక్యూ పూజారా...’ అంటూ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్..