పాకిస్తాన్‌ తరుపున మ్యాచ్ ఆడిన సచిన్ టెండూల్కర్... టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో...

Published : Apr 24, 2022, 03:37 PM IST

మరో వందేళ్ల తర్వాతైనా క్రికెట్ గురించి మాట్లాడాల్సి వస్తే, ముందుగా సచిన్ టెండూల్కర్ ప్రస్తావనే వస్తుంది. వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా, 100 సెంచరీలు, లెక్కకి మించి రికార్డులు, 200 టెస్టులు ఆడిన సచిన్ టెండూల్కర్... కెరీర్ ఆరంభంలో పాకిస్తాన్ తరుపున ఆడాడనే విషయం చాలామందికి తెలీదు...

PREV
17
పాకిస్తాన్‌ తరుపున మ్యాచ్ ఆడిన సచిన్ టెండూల్కర్... టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో...

సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌తో జరిగిన కరాచీ టెస్టు ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు.

27
Sachin Tendulkar

అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయడానికి ముందు పాక్ జట్టు తరుపున సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేశాడు సచిన్ టెండూల్కర్...

37

1987లో భారత పర్యటనకి వచ్చింది పాకిస్తాన్ జట్టు. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పాక్ ప్లేయర్లు జావెద్ మియాందాద్, అబ్దుల్ ఖాదిర్... లంచ్ బ్రేక్ కోసం ఫీల్డ్ వదిలి వెళ్లారు..

47

పాక్ జట్టులోని స్టాండ్ బై ప్లేయర్లు కూడా లంచ్ చేస్తూ ఉండడంతో సచిన్ టెండూల్కర్.. 14 ఏళ్ల వయసులో పాకిస్తాన్ జట్టు తరుపున సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్ చేశాడు...

57

‘ఈ విషయం ఇమ్రాన్ ఖాన్‌కి గుర్తుందో లేదో తెలీదు కానీ నేను పాకిస్తాన్ క్రికెట్ టీమ్ తరుపున ఓ సారి ఫీల్డింగ్ చేశాను...’ అంటూ ఈ సంఘటన గురించి రాసుకొచ్చాడు సచిన్ టెండూల్కర్...

67

పాక్ జట్టు తరుపున ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కపిల్ దేవ్ ఇచ్చిన క్యాచ్‌ని దాదాపు అందుకున్నంత పని చేశాడు టీనేజ్ సచిన్ టెండూల్కర్...

77

లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సచిన్ టెండూల్కర్, తనను మిడ్ ఆన్‌లో పెట్టి ఉంటే కపిల్ దేవ్ క్యాచ్‌ని అందుకునేవాడినని... పాక్ జట్టు తరుపున భారత ప్లేయర్ వికెట్ తీసిన భారత క్రికెటర్‌గా అత్యంత అరుదైన రికార్డు క్రియేట్ చేసేవాడినని కూడా చెప్పుకొచ్చాడు ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్...

click me!

Recommended Stories