Published : Mar 23, 2022, 02:12 PM ISTUpdated : Mar 23, 2022, 02:14 PM IST
Jasprit Bumrah Cute Request: సుమారు నెల రోజులకు పైగా బుమ్రా-సంజనాలు దూరంగా ఉంటున్నారు. దక్షిణాఫ్రికాతో పర్యటన ముగిసిన అనంతరం విశ్రాంతి తీసుకున్న బుమ్రా.. లంకతో స్వదేశంలో జరిగిన టెస్టులకు అందుబాటులో వచ్చాడు.
టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఐపీఎల్ సన్నాహకాల్లో భాగంగా ముంబై ఇండియన్స్ తో ప్రాక్టీస్ సెషన్ లో ఉన్నాడు. బయో బబుల్ లో గడుపుతున్న బుమ్రా.. తన భార్య సంజనా గణేషన్ కోసం సోషల్ మీడియా వేదికగా స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు.
27
బుమ్రా ముంబైలో ఉండగా సంజనా మాత్రం న్యూజిలాండ్ లో ఉంది. మహిళల ప్రపంచకప్ లో భాగంగా భారత జట్టు తరఫున ఆమె మ్యాచులకు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నది.
37
గతేడాది పూణెలో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట ఇటీవలే తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అయితే ఈ ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండటంతో కలిసికట్టుగా ఆ వేడుకను చేసుకోలేకపోయారు. సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు విషెస్ చెప్పుకున్నారు.
47
కాగా.. తాజాగా సోషల్ మీడియా వేదికగా బుమ్రా.. సంజనాకు రొమాంటిక్ రిక్వెస్ట్ పంపాడు. ఇద్దరూ కలిసి నవ్వుతున్న ఫోటోను షేర్ చేస్తూ... ‘దయచేసి త్వరగా వచ్చేయ్.. నువ్వు వేసే జోకులు లేక మన నవ్వును చాలా కోల్పోతున్నాం..’ అని రాసుకొచ్చాడు.
57
బుమ్రా ట్విట్టర్ లో ఈ ఫోటో షేర్ చేయగానే వేలాది మంది నెటిజన్లు లైకులు, కామెంట్లు చేస్తూ అతడిని ఆటపట్టించారు. జట్టులో పెళ్లైన ఆటగాళ్లంతా భార్యలతో వచ్చి నువ్వు ఒక్కడివే ఉండేసరికి ఫీలవుతున్నావా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
67
ఇదిలాఉండగా ఈనెల 27న ముంబై ఇండియన్స్.. తమ తొలి మ్యాచును ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనున్నది. గతేడాది ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోయిన ముంబై.. ఈసారి మాత్రం ఎలాగైనా కప్ పట్టాలనే లక్ష్యంతో ఉంది.
77
ఇదిలాఉండగా.. స్టార్ స్పోర్ట్స్ లో స్సోర్ట్స్ యాంకర్ గా పనిచేస్తున్న సంజనా ఈ ఐపీఎల్ సీజన్ లో మెరవనున్నది. మయంతి లంగర్ తో పాటు మరో ముగ్గురు భామలు కలిసి ఐపీఎల్ లో గ్లామర్ ను జోడించనున్నారు.