ఆ నలుగురి మధ్య ఆర్‌సీబీ కెప్టెన్సీ పోరు... ఫాఫ్ డుప్లిసిస్‌కి మాత్రం ఇవ్వొద్దంటూ...

Published : Feb 18, 2022, 10:05 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్త కెప్టెన్ కోసం చూస్తున్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఈ సీజన్‌లో ఆర్‌సీబీలోని నలుగురి ప్లేయర్ల మధ్య కెప్టెన్సీ కోసం పోటీ నడుస్తోంది...

PREV
112
ఆ నలుగురి మధ్య ఆర్‌సీబీ కెప్టెన్సీ పోరు...  ఫాఫ్ డుప్లిసిస్‌కి మాత్రం ఇవ్వొద్దంటూ...

గత 9 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును నడిపించిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించాడు...

212

మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ, ఐపీఎల్ 2016 సీజన్‌లో ఆర్‌సీబీని ఫైనల్ చేర్చినా టైటిల్ అందించలేకపోయాడు...

312

ఐపీఎల్ 2022 సీజన్ రిటెన్షన్‌లో విరాట్ కోహ్లీతో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను అట్టిపెట్టుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

412

బిగ్ బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌ జట్టుకి కెప్టెన్‌గా ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ఆర్‌సీబీ కెప్టెన్సీ రేసులో నిలిచాడు...

512

అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాదిరిగానే మెల్‌బోర్న్ స్టార్స్ కూడా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బీబీఎల్ టైటిల్ గెలవలేకపోయింది... 9 సార్లు సెమీస్ చేరి, మూడు సార్లు రన్నరప్‌గా నిలిచింది.

612

గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లిసిస్‌ని ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.7 కోట్లకు కొనుగోలు చేసింది ఆర్‌సీబీ...

712

కెప్టెన్సీ అనుభవం ఉన్న ఫాఫ్ డుప్లిసిస్, ఆర్‌సీబీ తర్వాతి కెప్టెన్సీ రేసులో ముందంజలో ఉన్నాడు. హర్షల్ పటేల్ కూడా డుప్లిసిస్‌కే కెప్టెన్సీ ఇస్తారని కామెంట్ చేశాడు...

812

అయితే సీఎస్‌కే వీరాభిమానిగా ముద్రేసుకున్న ఫాఫ్ డుప్లిసిస్‌కి ఆర్‌సీబీ కెప్టెన్సీ ఇవ్వడం కరెక్ట్ కాదంటున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్...

912

కేకేఆర్‌తో పాటు దేశవాళీ టోర్నీల్లో తమిళనాడు జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌ కూడా ఆర్‌సీబీ తర్వాతి కెప్టెన్ రేసులో నిలిచాడు...

1012

దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో తమిళనాడు జట్టు రెండు సార్లు సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలు గెలిచింది. కేకేఆర్ కూడా మంచి విజయాలు అందుకుంది...

1112

ఈ ముగ్గురితో పాటు విరాట్ కోహ్లీని ఎలాగైనా ఒప్పించి, తిరిగి ఆర్‌సీబీ కెప్టెన్‌గా నియమించాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్...

1212

విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, ఫాఫ్ డుప్లిసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లలో ఆర్‌సీబీ తర్వాతి కెప్టెన్ ఎవరు అవుతారనేది ఉత్కంఠభరితంగా మారింది...

Read more Photos on
click me!

Recommended Stories