5,4,2,1... గెలిచినోళ్లంతా బ్యాగులు సర్దుకున్నారు, ఆ ఒక్క టీమ్ తప్ప! ఐపీఎల్ 2022లో కొత్త విన్నర్...

First Published May 20, 2022, 3:31 PM IST

ఐపీఎల్ చరిత్రలో 2022 సీజన్‌కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. భారీ అంచనాలతో బరిలో దిగిన జట్లన్నీ బాల్చీ తన్నేస్తే, ఎలాంటి అంచనాలు లేకుండా సీజన్‌ని ఆరంభించిన జట్లేమో ప్లేఆఫ్స్ రేసులో ప్లేస్ కన్ఫార్మ్ చేసుకున్నాయి...

ఐపీఎల్ 2022 సీజన్‌లో న్యూ ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని విధంగా టేబుల్ టాపర్‌గా నిలిచి, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన తొలి జట్లుగా మారాయి...

కెప్టెన్‌గా ఏ మాత్రం మెరుగైన రికార్డు లేని కెఎల్ రాహుల్ కెప్టెన్సీలో లక్నో, అసలు కెప్టెన్సీ అనుభవమే లేని హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటాన్స్... మిగిలిన జట్లకు చుక్కలు చూపించాయి...
 

కొత్త జట్లు, ఈ సీజన్‌లో అద్భుతంగా అదరగొడితే... మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్.. పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాల్లో నిలిచాయి...

5 ఐపీఎల్ టైటిల్స్ ఉన్న ముంబై ఇండియన్స్ ఇప్పటికే 10 పరాజయాలు అందుకుని, చెత్త రికార్డు మూటకట్టుకోగా... 4 టైటిల్స్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, తొలిసారి 9 పరాజయాలు అందుకుంది...
 

రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో పాటు, 2016 సీజన్‌లో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్కమించాయి... ప్లేఆఫ్స్ రేసులో ఒకే ఒక్క టైటిల్ విన్నర్ రాజస్థాన్ రాయల్స్...

2008 సీజన్‌లో ఫైనల్ చేరి, మొట్టమొదటి టైటిల్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్, 14 సీజన్ల తర్వాత తొలిసారి టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటిగా కనిపిస్తోంది. 2018లో ప్లేఆఫ్స్‌కి చేరిన ఆర్ఆర్, గత రెండు సీజన్లలో 8,7 స్థానాల్లో నిలవడం విశేషం...

Rajasthan Royals

16 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ఆఖరి మ్యాచ్‌లో గెలిస్తే టాప్ 2లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది. ఓడినా, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌పై స్వల్ప తేడాతో గెలిస్తే... ఆర్ఆర్ ప్లేఆఫ్స్‌కి చేరుతుంది...

74 మ్యాచుల సీజన్‌లో లీగ్ స్టేజీలో మరో 3 మ్యాచులు మిగిలి ఉండగానే రెండు జట్లు ప్లేఆఫ్స్‌కి చేరగా, మరో నాలుగు జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి. మిగిలిన 3 జట్లు, రెండు ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీపడుతున్నాయి...

click me!