3, 4 స్థానాలలోనే గాక టాపార్డర్ లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగల సమర్థుడు త్రిపాఠి. అతడు చాలా ప్రమాదకర ఆటగాడు. రాహుల్ గనక ఇదే ఆటను కొనసాగిస్తే.. అతడు త్వరలోనే సెలెక్టర్ల దృష్టిని ఆకర్షిస్తాడు. త్రిపాఠిలో నాకు నచ్చే అంశమేమిటంటే.. అతడు నిర్భయంగా ఆడతాడు. బౌలర్ ఎవరన్నది చూడకుండా తన ఆట తాను ఆడతాడు. రాహుల్ క్రీజులో ఉన్నాడంటే అతడిని ఔట్ చేసేందుకు ప్రత్యర్థి జట్లు ప్రయత్నిస్తాయి.