పిల్లలు చూస్తున్నారు, కాస్త నోరు అదుపులో పెట్టుకో... హార్ధిక్ పాండ్యాకి మహ్మద్ షమీ సలహా...

Published : May 16, 2022, 01:47 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా కొత్త అవతారం ఎత్తాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. గత రెండు సీజన్లలో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేక ముంబై ఇండియన్స్ రిటెన్షన్ కార్డు దక్కించుకోలేకపోయిన హార్ధిక్ పాండ్యాను రూ.15 కోట్లకు డ్రాఫ్ట్ రూపంలో కొనుగోలు చేసిన టైటాన్స్, కెప్టెన్సీ అప్పగించింది...  

PREV
18
పిల్లలు చూస్తున్నారు, కాస్త నోరు అదుపులో పెట్టుకో... హార్ధిక్ పాండ్యాకి మహ్మద్ షమీ సలహా...

ఏ మాత్రం అంచనాలు లేకుండా సీజన్‌ని ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్ 2022లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది... మిగిలిన జట్లనీ ఒక్క విజయం కోసం చచ్చీ పడి పోరాడుతుంటే టైటాన్స్ ఇప్పటికే 10 విజయాలతో టాప్ ప్లేస్ కన్ఫార్మ్ చేసుకుంది...

28

బేసిగ్గానే పాండ్యా బ్రదర్స్, ప్రతీ చిన్నదానికి కాస్త ఓవర్‌గా రియాక్ట్ అవుతూ ఉంటారు, ఈ కారణంగా కృనాల్ పాండ్యా అనేక ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటాడు. అయితే కెప్టెన్సీ దక్కిన తర్వాత హార్ధిక్ పాండ్యా చాలా వరకూ కూల్ అండ్ కామ్‌గానే కనిపించాడు...

38

అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ షమీని బూతులు తిడుతూ కోపాన్ని వెల్లగక్కాడు హార్ధిక్ పాండ్యా. సీనియర్ ప్లేయర్ అని చూడకుండా షమీని తిట్టిన హార్ధిక్ పాండ్యాపై తీవ్ర విమర్శలు వచ్చాయి..

48

‘కెప్టెన్ అయ్యాక హార్ధిక్ పాండ్యా చాలా నార్మల్‌గా మారాడు. అతని రియాక్షన్స్ కొన్ని చాలా టెంపర్‌గా ఉంటున్నాయి. అందుకే ‘ప్రపంచమంతా క్రికెట్ చూస్తున్నారు, నీ పిల్లలు కూడా కాబట్టి నీ ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకో’.. అని చెప్పాను..

58
Mohammed Shami

కెప్టెన్‌గా ఉండే వ్యక్తి చాలా హుందాగా వ్యవహరించడం చాలా అవసరం. పరిస్థితులను బట్టి, తన పాత్రను చక్కగా పోషించాల్సి ఉంటుంది. ఒక్కో కెప్టెన్‌కి ఒక్కో రకమైన స్టైల్‌, టెంపర్‌మెంట్ ఉంటాయి...

68

ఎమ్మెస్ ధోనీ నెమ్మదస్థుడు, కూల్‌గా ఉంటాడు. అయితే విరాట్ అయితే దూకుడు. రోహిత్ పరిస్థితులకు తగ్గట్టుగా మ్యాచ్‌ని నడిపిస్తాడు. కాబట్టి హార్ధిక్ పాండ్యా మైండ్‌సెట్‌ని అర్థం చేసుకోవడం నాకు రాకెట్ సైన్స్ ఏమీ కాదు..
 

78

నా పర్ఫామెన్స్‌ చూస్తే నేను 100కి నూరు శాతం రిజల్ట్ ఇస్తున్నా. ఈ సీజన్‌లోనే కాదు, గత నాలుగు సీజన్లుగా బాగానే ఆడుతున్నా. నేను ఆడిన టీమ్స్‌లో ఎవ్వరూ కూడా నా కంటే ఎక్కువ వికెట్లు తీయలేకపోయారు...’ అంటూ చెప్పుకొచ్చాడు మహ్మద్ షమీ...

88

గత మూడు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి ఆడిన మహ్మద్ షమీని ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.6.25 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ టైటాన్స్. సీజన్‌లో 12 మ్యాచుల్లో 7.87 సగటుతో 16 వికెట్లు తీశాడు మహ్మద్ షమీ...

click me!

Recommended Stories