ఐపీఎల్ పట్టించుకోలేదు.. కానీ మాల్దీవులు పిలిచి ఘనంగా సత్కరించింది.. రైనాకు ప్రతిష్టాత్మక అవార్డు

Published : Mar 20, 2022, 12:18 PM IST

Suresh Raina Got Sports Icon Award: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన  బ్యాటర్ గా గుర్తింపు పొందిన రైనా.. ఇటీవలే ముగిసిన వేలం ప్రక్రియలో అమ్ముడుపోలేదు.  దీంతో అతడు ప్రస్తుతం ఐపీఎల్ లో కొత్త అవతారం ఎత్తనున్నాడు.  

PREV
19
ఐపీఎల్ పట్టించుకోలేదు.. కానీ మాల్దీవులు పిలిచి ఘనంగా సత్కరించింది..  రైనాకు ప్రతిష్టాత్మక అవార్డు

టీమిండియా  మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను ఈసారి ఐపీఎల్ వేలంలో  ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు.   భారత జట్టు నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం అతడు గతేడాది ఐపీఎల్ లో తన సొంత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడినా పెద్దగా ఆకట్టుకోలేదు. 

29

రైనా లో మునపటి ఫామ్ కరువవడం,  గత సీజన్ లో దారుణంగా విఫలం కావడంతో ఈసారి సీఎస్కేతో పాటు ఇతర జట్లు కూడా అతడిపై అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో అతడు వేలం ప్రక్రియలో అమ్ముడుపోలేదు.

39

ఐపీఎల్ ఫ్రాంచైజీలు పట్టించుకోకపోయినా రైనాకు మాల్దీవులు ప్రభుత్వం అతడికి ప్రతిష్టాత్మక అవార్డును అందజేసింది.   ఆ దేశ ప్రభుత్వం ప్రతి యేటా అందించే స్పోర్ట్స్ ఐకాన్ అవార్డుకు రైనా పేరును ఎంపిక చేసింది.

49

శనివారం మాల్దీవులులో జరిగిన ఓ కార్యక్రమంలో  రైనా బంగ్లాదేశ్  క్రీడా శాఖ మంత్రి  మహ్మద్ జహీర్ అహ్సన్ రసెల్ చేతుల మీదుగా  స్పోర్ట్స్ ఐకాన్ అవార్డు అందుకున్నాడు.  
 

59

రైనాతో పాటు మరికొందరు అంతర్జాతీయ క్రీడాకారులు కూడా ఈ అవార్డు దక్కింది. వారిలో రియల్ మాడ్రిడ్ మాజీ ఆటగాడు రొబార్టో కార్లోస్, జమైకన్ స్ప్రింటర్ అసఫ పావెల్, శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య, డచ్ ఫుట్ బాల్ లెజెండ్ ఎడ్గర్ డేవిడ్స్ కూడా ఉన్నారు. 

69

తన కెరీర్ లో సాధించిన అత్యద్భుత విజయాలకు గాను రైనాకు  ఈ అవార్డు దక్కింది.  ఈ కార్యక్రమానికి సౌదీ అరేబియా క్రీడా శాఖ మంత్రి అల్ కది అబ్దుల్ రెహ్మాన్, మాల్దీవులు టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు అహ్మద్ నజీర్ కూడా హాజరయ్యారు.  అంతేగాక ఈ కార్యక్రమానికి మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ కూడా హాజరవ్వడం విశేషం. 

79

ఇక ఐపీఎల్ లో రైనా వ్యక్తిగత రికార్డుల విషయానికొస్తే.. 2008 సీజన్ నుంచి మొన్నటి సీజన్ వరకు అతడు 205 మ్యాచులు ఆడాడు. ఐపీఎల్ లో  చెన్నై నిషేధం ఎదుర్కున్న రెండేండ్లు మినహా  మిగిలిన సీజన్లన్నింటిలో రైనా.. సీఎస్కే తరఫునే ఉన్నాడు. 

89

205 మ్యాచులలో ఏకంగా 5,528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 39 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. 2013 సీజన్ లో రైనా సెంచరీ  చేశాడు. తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్ ఆసాంతం రాణించిన రైనా.. గత సీజన్ లో మాత్రం 12 మ్యాచులాడి కేవలం 160 పరుగులు మాత్రమే సాధించాడు. 

99

దీంతో ఈసారి చెన్నై అతడిని రిటైన్ చేసుకోలేదు. అంతేగాక వేలంలో కూడా  ఆసక్తి చూపలేదు. దీంతో అతడు  ప్రముఖ భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రితో కలిసి హిందీ కామెంట్రీ చెప్పనున్నాడు. 

click me!

Recommended Stories