IPL: వాళ్లతో ఆడటం గొప్ప గౌరవం.. ఈసారి ఆ ఆటగాళ్లు కీలక పాత్ర పోషిస్తారు : కేకేఆర్ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Mar 20, 2022, 10:54 AM IST

IPL 2022: ఈనెల 26 నుంచి ప్రారంభం కాబోతున్న ఐపీఎల్-15వ సీజన్ లో ఓపెనింగ్ మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్స్, రన్నరప్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగనున్నది. ఈ నేపథ్యంలో కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

PREV
17
IPL: వాళ్లతో ఆడటం గొప్ప గౌరవం.. ఈసారి ఆ ఆటగాళ్లు కీలక పాత్ర పోషిస్తారు : కేకేఆర్ సారథి ఆసక్తికర వ్యాఖ్యలు

మరో ఆరు రోజుల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ కొత్త సారథి శ్రేయస్ అయ్యర్  ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

27

జట్టులో సీనియర్లైన ఆస్ట్రేలియా  టెస్టు సారథి పాట్ కమిన్స్, ఆసీస్ వన్డే జట్టు  కెప్టెన్ ఆరోన్ ఫించ్, భారత టెస్టు మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే లతో కలిసి పని చేయడం పట్ల అయ్యర్  మాట్లాడాడు. వాళ్లతో కలిసి ఆడటం గౌరవంగా భావిస్తున్నాని చెప్పుకొచ్చాడు. 

37

అయ్యర్ మాట్లాడుతూ.. ‘వాళ్లు (ఆరోన్ ఫించ్, పాట్ కమిన్స్, అజింక్యా రహానే) లు జట్టులో కీలక సభ్యులు. వారి దేశాల కోసం ఎన్నో గొప్ప ప్రదర్శనలు చేశారు. అలాంటి ఆటగాళ్లతో  కలిసి ఆడుతుండటాన్ని గొప్ప గౌరవంగా భావిస్తాను. 

47

ఐపీఎల్ లో మ్యాచుల సందర్భంగా ఈ అనుభవజ్ఞులైన ఆటగాళ్ల దగ్గరి నుంచి నేను సలహాలు తీసుకుంటాను. వాళ్ల సూచనలు తప్పకుండా పాటిస్తాను. మైదానంలోనే కాదు.. ఆఫ్ ది పీల్డ్ లో కూడా ఈ ఆటగాళ్లు మా జట్టులో కీలక పాత్ర పోషిస్తారు. 

57

ఒక జట్టును సమర్థవంతంగా నిర్వహించడంలో యువకులు, సీనియర్లు కలిసి  చర్చించుకోవాలి. అందరితోనూ కలిసి మాట్లాడాలి.  అవే జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విధంగా చూసుకున్నా రహానే, ఫించ్, కమిన్స్ లు ఎంతో అనుభవజ్ఞులు.  వారి సేవలను కచ్చితంగా ఉపయోగించుకుంటాం..’ అని తెలిపాడు. 

67

ఈనెల 26న కేకేఆర్.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో  చెన్నైతో ఓపెనింగ్ మ్యాచులో తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే వారికి కేటాయించిన హోటల్ కు వచ్చిన  ఆ జట్టు కీలక ఆటగాళ్లంతా  ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 

77

కేకేఆర్ జట్టు : ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, నితీష్ రాణా, పాట్ కమిన్స్, శివమ్ మావి, షెల్డన్ జాక్సన్, అజింక్యా రహానే, రింకు సింగ్, అనుకుల్ రాయ్, రసిఖ్ దర్, బాబా ఇంద్రజీత్, చమిక కరుణరత్నె, అజిజిత్ తోమర్, ప్రథమ్ సింగ్, అశోక్ శర్మ, సామ్ బిల్లింగ్స్, అలెక్స్ హేల్స్, టిమ్ సౌథీ, రమేశ్ కుమార్,  మహ్మద్ నబీ, ఉమేశ్ యాదవ్, అమన్ ఖాన్ 

click me!

Recommended Stories