కెప్టెన్‌గా రిషబ్ పంత్ చేసిన తప్పు ఇదే... అలాంటి బౌలర్‌ను టీమ్‌లో పెట్టుకుని, ఆడించకుండా...

Published : Mar 27, 2022, 06:30 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్‌గా మంచి మార్కులు కొట్టేసిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యధిక మొత్తం అందుకుంటున్న కెప్టెన్లలో ఒకడిగా ఉన్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ సెలక్షన్ విషయంలో ఓ చిన్న తప్పు కారణంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది ఢిల్లీ క్యాపిటల్స్...

PREV
19
కెప్టెన్‌గా రిషబ్ పంత్ చేసిన తప్పు ఇదే... అలాంటి బౌలర్‌ను టీమ్‌లో పెట్టుకుని, ఆడించకుండా...

గత రెండు, మూడు సీజన్లలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ రిజర్వు బెంచ్‌లో మగ్గిపోయి, ఒక్క ఛాన్స్ కోసం ఆశగా ఎదురుచూసిన కుల్దీప్ యాదవ్‌ను అద్భుతంగా వాడుకున్నాడు రిషబ్ పంత్...

29

ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున తొలి మ్యాచ్ ఆడుతున్న కుల్దీప్ యాదవ్, 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.. రోహిత్ శర్మతో పాటు అన్‌మోల్‌ప్రీత్ సింగ్, కిరన్ పోలార్డ్‌లను పెవిలియన్ చేర్చాడు కుల్దీప్...

39

అయితే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్‌ను తుదిజట్టులోకి తీసుకోని రిషబ్ పంత్, తెలుగు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌కి కూడా అవకాశం ఇవ్వలేదు...

49

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఎంట్రీ ఇచ్చి, అదరగొట్టిన యంగ్ పేసర్ చేతన్ సకారియాకి తుదిజట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

59

గత సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన చేతన్ సకారియా, 14 వికెట్లు తీశాడు.  8.19 ఎకానమీతో బౌలింగ్ చేసిన సకారియా, ఎమ్మెస్ ధోనీ వంటి సీనియర్ బ్యాటర్లను కూడా ఇబ్బందిపెట్టాడు...

69

మెగా వేలంలో రూ.4.20 కోట్లకు చేతన్ సకారియాని కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌పై అతన్ని ఆడించి ఉంటే మంచి రిజల్ట్ వచ్చి ఉండేదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

79

ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసిన శార్దూల్ ఠాకూర్, ఏకంగా 47 పరుగులు సమర్పించాడు. యంగ్ పేసర్ కమ్లేశ్ నాగర్‌కోటీ తన 2 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చాడు...
 

89

ఈ ఇద్దరి కారణంగా ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేయగలిగింది. మిడిల్ ఆర్డర్‌ బ్యాటర్లు పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వకపోయినా ఇషాన్ కిషన్‌కి తోడు రోహిత్ శర్మ, తిలక్ వర్మ మెరుపులతో 177 పరుగుల భారీ స్కోరు చేసింది ముంబై ఇండియన్స్...

99

నాగర్‌కోటీ స్థానంలో చేతన్ సకారియాని, మన్‌దీప్ సింగ్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను ఆడించి ఉంటే రిజల్ట్ ఇంకాస్త బాగుండేదని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

Read more Photos on
click me!

Recommended Stories