మేం వాళ్లలా కాదు, కంట్రోల్ అంతా ఎమ్మెస్ ధోనీ చేతుల్లోనే ఉంటుంది... సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్..

First Published May 1, 2022, 8:41 PM IST

ఐపీఎల్‌లో కానీ, టీమిండియాలో కానీ టీమ్ సెలక్షన్‌లో కెప్టెన్ పాత్ర ఎంత? ఈ ప్రశ్నకు క్రికెట్ విశ్లేషకులు కూడా అంత ఈజీగా సమాధానం చెప్పలేరు. అయితే ఎమ్మెస్ ధోనీ విషయంలో మాత్రం ఇవన్నీ చెల్లవు. మాహీ ఏం చెబితే అది, ఎవరిని చెబితే వారిని జట్టును సెలక్ట్ చేయాల్సిందే. మరోసారి ఈ విషయాన్ని ఖరారు చేశాడు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్... 

బీసీసీఐ సెలక్టర్లు, జట్టును సెలక్ట్ చేసిన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ, తనకు కేవలం సమాచారం మాత్రమే ఇచ్చేవారని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం క్రియేట్ చేశాయి. 

ఐపీఎల్ 2021 సీజన్‌లో టీమ్ సెలక్షన్ విషయంలో కామెంట్ చేసినందుకే డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్సీని కోల్పోయి, జట్టును వీడాల్సి వచ్చింది...

Latest Videos


అయితే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ రావడానికి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీయే కారణం. అందుకే సీఎస్‌కేలో మాహీ ఏం చెబితే అదే శాసనం అంటున్నాడు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్...

‘రవీంద్ర జడేజాని కెప్టెన్సీ నుంచి తప్పించాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది. జడ్డూ కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అనుకున్నాడు. దీనికి టీమ్ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు...

టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయాలన్ని ఎమ్మెస్ ధోనీ నిర్ణయమే ఫైనల్. ఎమ్మెస్ ఎప్పుడూ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. సీఎస్‌కే టీమ్ అతను సొంత టీమ్‌గానే భావిస్తాడు...

అందుకే చెన్నై సూపర్ కింగ్స్‌కి ఏది మంచిదో ఎమ్మెస్ ధోనీకే బాగా తెలుసు. ఆయన తీసుకునే నిర్ణయాలను మేం ప్రశ్నించబోం...’ అంటూ కామెంట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథ్..

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు ఎమ్మెస్ ధోనీ. దీంతో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సీఎస్‌కే కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు...

జడ్డూ కెప్టెన్సీలో 8 మ్యాచులు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్, 2 విజయాలు మాత్రమే సాధించగలిగింది. అదీగాక ప్లేయర్‌గానూ జడ్డూ ఫెయిల్ అవుతుండడంతో తిరిగి సీఎస్‌కే సారథిగా బాధ్యతలు తీసుకున్నాడు ఎమ్మెస్ ధోనీ...

click me!