టీమిండియాను ఇలా మార్చేసింది మాహీయే... ధోనీపై వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్స్...

First Published May 1, 2022, 6:01 PM IST

భారత జట్టుకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అయితే మాహీ కెప్టెన్సీలో భారత జట్టులోని చాలా మంది సీనియర్లు జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది. లెజెండరీ క్రికెటర్లుగా ఎదగాల్సిన వాళ్లు కూడా అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. వారిలో ముఖ్యుడు వీరేంద్ర సెహ్వాగ్...

టెస్టులను వన్డేల్లా, వన్డేలను టీ20ల్లా ఆడే వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్, ఓపెనర్‌గా అద్భుతమైన రికార్డులెన్నో నెలకొల్పాడు...

Virender Sehwag

టీమిండియా తరుపున టెస్టుల్లో మొట్టమొదటి త్రిబుల్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా నిలిచిన సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన క్రికెటర్‌గా నిలిచాడు...

Latest Videos


అయితే వీరేంద్ర సెహ్వాగ్‌కి కెరీర్ చరమాంకంలో రావాల్సినన్ని అవకాశాలు రాలేదు. వికెట్ల మధ్యలో నెమ్మదిగా పరుగెత్తుతున్నాడనే కారణంగా వీరూని జట్టుకి దూరం చేశాడు ఎమ్మెస్ ధోనీ...

అయితే వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం మహేంద్ర సింగ్ ధోనీని ప్రశంసల్లో ముంచెత్తాడు. ‘నేను ధోనీని 2005 నుంచి చూస్తున్నా. అతను భారత జట్టులో ఎన్నో మార్పులు చేశాడు... 

మేం వరుసగా మ్యాచులు ఓడిపోతున్న సమయంలో ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. ఓటములకు బ్రేక్ వేసి, విజయాల బాట పట్టించాడు. ఎక్కడైతే ఓడిపోయామే, అక్కడ మాహీ కెప్టెన్సీలో గెలిచాం...

ఆస్ట్రేలియాలో ఆసీస్‌ని ఓడిస్తామని అస్సలు ఊహించలేదు, మాహీ దాన్ని చేసి చూపించాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచులు గెలిచాం. స్వదేశీ సిరీస్‌లు గెలిచాం...

ఇంతకుముందు విజయం అంచుల దాకా వచ్చిన ఓడిన మ్యాచులను ఎలా ఫినిష్ చేయాలో మాహీ చేసి చూపించాడు. ఇప్పుడు సీఎస్‌కే పరిస్థితి కూడా అదే. మాహీ మ్యాజిక్ మళ్లీ పనిచేస్తుంది...

Image Credit: Getty Images (File Photo)

నా అంచనా ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్, మాహీ కెప్టెన్సీలో వరుసగా 6 మ్యాచుల్లో గెలిచి, ప్లేఆఫ్స్ చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రవీంద్ర జడేజా 8 మ్యాచుల్లో 2 విజయాలు మాత్రమే అందుకోగలిగాడు. ప్లేయర్‌గా విఫలం అవుతుండడంతో ఆటపై ఫోకస్ పెట్టేందుకు కెప్టెన్సీని తిరిగి ధోనీకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాడు జడేజా...

click me!