రాహుల్ టీమ్, అంపైర్లను కొనేసిందా... ఢిల్లీ క్యాపిటల్స్‌కి వ్యతిరేకంగా ఇన్ని నిర్ణయాలా?...

Published : May 01, 2022, 07:58 PM IST

ఐపీఎల్‌కి క్రేజ్ ఎక్కువే, ఈ లీగ్‌పై నిందలూ ఎక్కువే. ముంబై ఇండియన్స్ ఐదు సార్లు టైటిల్ గెలిచినా, ఆ టీమ్ ఓనర్ అంబానీ అంపైర్లతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ చేశారనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ ఫెయిల్యూర్ ఆ ట్రోల్స్ కాస్త తగ్గగా... ఇప్పుడు లక్నో టీమ్ ఈ రకమైన విమర్శలు ఎదుర్కొంటోంది...

PREV
111
రాహుల్ టీమ్, అంపైర్లను కొనేసిందా... ఢిల్లీ క్యాపిటల్స్‌కి వ్యతిరేకంగా ఇన్ని నిర్ణయాలా?...

గతంలో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌ టీమ్‌ని సొంతం చేసుకున్న ఆర్‌పీ సంజీవ్ గోయింకా, రూ.7090 కోట్ల భారీ ధర చెల్లించి లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే...

211

పెద్దగా అంచనాలు లేకుండా సీజన్‌ని మొదలెట్టిన లక్నో సూపర్ జెయింట్స్, ఆ తర్వాత వరుస విజయాలతో టేబుల్ టాప్ 3లో కొనసాగుతోంది... ఎప్పుడూ లేనట్టుగా కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గానూ సూపర్ సక్సెస్ అవుతున్నాడు.

311

అయితే ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్లు ఇచ్చిన నిర్ణయాలన్నీ ఎల్‌ఎస్‌జీ టీమ్‌కి అనుకూలంగా ఉండడంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు ఢీసీ ఫ్యాన్స్...

411

బీభత్సమైన ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, మోహ్సీన్ ఖాన్ బౌలింగ్‌లో ఆయుష్ బదోనీ పట్టిన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు. అయితే టీవీ రిప్లైలో బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపించినా థర్డ్ అంపైర్ అవుట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది...

511
Mitchell Marsh

ఓపెనర్లను వెంటవెంటనే కోల్పోయినా మిచెల్ మార్స్, రిషబ్ పంత్ కలిసి మూడో వికెట్‌కి 4 ఓవర్లలో 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

611

గౌతమ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ డి కాక్ క్యాచ్‌ పట్టాడు. అయితే టీవీ రిప్లైలో బ్యాటుకి బాల్ తగలనట్టు స్పష్టంగా కనిపించింది. బౌలర్ కాన్ఫిడెంట్‌గా అప్పీలు చేయకపోయినా అంపైర్ అవుట్ ఇవ్వడం, బాల్ తగల్లేదని తెలిసినా మిచెల్ మార్ష్ డీఆర్‌ఎస్ తీసుకోకుండా పెవిలియన్ చేరడం పలు అనుమానాలకు తావిస్తోంది...

711

‘మిచెల్ మార్ష్ అవుటైన విధానాన్ని నమ్మలేకపోతున్నాడు. బౌలర్ నమ్మకంగా లేడు. అంపైర్ అవుట్ ఇవ్వగానే బ్యాట్స్‌మెన్ నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అల్ట్రా ఎడ్జ్‌లో ఏమీ లేనట్టు చూపించింది. ఆ సమయంలో రెండు సౌండ్స్ వచ్చినట్టు వినిపించాయి. కానీ బాల్, బ్యాటుకి తగిలిందీ లేనిదీ బ్యాట్స్‌మెన్‌కి తెలుస్తుంది కదా... ’ అంటూ ట్వీట్ చేశాడు కామెంటేటర్ హర్షా భోగ్లే...

811

అలాగే జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో వైడ్‌గా వేసిన ఓ బంతి, వికెట్ల వెనకాల బౌండరీ లైన్‌ని తాకేటప్పుడు కృనాల్ పాండ్యా వచ్చి అడ్డుకున్నాడు. అయితే బంతిని ఆపే క్రమంలో కృనాల్ పాండ్యా కాలు, బౌండరీ లైన్‌ని తాకింది. బౌండరీ లైన్‌ని కాలితో వెనక్కి అన్నాడు కృనాల్... అయితే థర్డ్ అంపైర్ వైడ్ కానీ, బౌండరీ కానీ ఇవ్వకపోవడంపై ఢిల్లీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు...

911

‘నాకు తెలిసి బౌండరీ లైన్ దగ్గర ఉన్న రోప్‌ని వెనక్కి లాగకూడదు. ఎక్కడ రోప్ ఉందో అక్కడే ఉండాలి. అలా చూస్తే కృనాల్ ఆపిన బంతికి 4 రావాలి కదా...’ అంటూ ట్వీట్ చేశాడు న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీశమ్...

1011

196 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగులు చేసి 6 పరుగుల తేడాతో ఓడింది. ఆ వైడ్+4 పరుగులు ఇచ్చి ఉంటే...  విజయం ఢిల్లీ క్యాపిటల్స్‌కే దక్కి ఉండేది. 

1111

ఒకే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి వ్యతిరేకంగా ఇన్ని అంపైర్ నిర్ణయాలు రావడంతో భారీ ధర పెట్టి జట్టును కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్... ఆ డబ్బులను రాబట్టుకోవడానికి అంపైర్లను కొనేసినట్టున్నారని అని ఆరోపిస్తున్నారు అభిమానులు...

Read more Photos on
click me!

Recommended Stories