మాహీతో ఆడితే చాలు, ఎంత ఇచ్చినా... సీఎస్‌కే రిటెన్షన్‌పై మొయిన్ ఆలీ కామెంట్స్...

First Published Dec 2, 2021, 2:07 PM IST

క్రికెటర్ల క్రేజ్ యందు, మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ వేరయా...  ఇది క్రికెట్‌లో సరిగా సరిపోయే నానుడి. మహేంద్ర సింగ్ ధోనీ టీమ్‌‌లో, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఆడడాన్ని ఓ గౌరవంగా భావిస్తారు క్రికెటర్లు. ఆ జాబితాలో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ కూడా చేరిపోయాడు...

ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్ కైవసం చేసుకుని, నాలుగోసారి విజేతగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ సీజన్‌లో సీఎస్‌కే విజయాల్లో కీలక పాత్ర పోషించాడు ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ...

ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో ఆర్‌సీబీ విడుదల చేసిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీని రూ.7 కోట్లకి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

2018 నుంచి 2020 వరకూ మూడు సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడిన మొయిన్ ఆలీ, మొత్తంగా 309 పరుగులు, 10 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు...

2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన 15 మ్యాచుల్లో బౌలింగ్‌లో 6 వికెట్లు తీసిన మొయిన్ ఆలీ, బ్యాటుతో అద్భుతంగా రాణించి 357 పరుగులు చేశాడు...

సీనియర్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా పెద్దగా రాణించకపోయినా మొయిన్ ఆలీ వన్‌డౌన్‌లో రాణించడంతో చాలా విజయాలు అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్...

‘‘మేం మొయిన్ ఆలీతో ముందుగా మాట్లాడాం. ఈ ఆఫర్ ఇచ్చినప్పుడు అతను చాలా సంతోషించాడు. సీఎస్‌కే తప్ప వేరే ఫ్రాంఛైజీకి ఆడాలనే ఆలోచన కూడా తనకి రాలేదని అన్నాడు...

‘నాకు ఫస్ట్ రిటెన్షన్ ఇచ్చారా? లేదా మూడో, నాలుగో రిటెన్షన్ ఇచ్చారా? అనేది అనవసరం. నన్ను రిటైన్ చేసుకుంటే చాలు, నేను ఆడతాను. డబ్బుల గురించి నాకు ఆలోచన లేదు...’ అని మొయిన్ ఆలీ చెప్పాడు...

తన ఆటతీరును, ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసిన మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో వీలైనంత ఎక్కువ కాలం ఆడాలని మొయిన్ ఆలీ కోరుకుంటున్నాడు...

అతను జట్టుకి ఎంతగానో ఉపయోగపడతాడు. వచ్చే సీజన్లలో ఇండియాలోనే ఐపీఎల్ జరగనుంది. భారత్‌లో పిచ్‌లపైన మొయిన్ ఆలీ, పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్...

గత ఏడాది కొన్ని కారణాల వల్ల అతన్ని కొనుగోలు చేయలేకపోయాం. ఈ ఏడాది జట్టులోకి రావడం, అతను ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో అద్భుతంగా ఆడడం చాలా సంతోషంగా ఉంది...’’ అంటూ చెప్పుకొచ్చాడు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్...

‘ఇప్పటివరకూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ఎమ్మెస్ ధోనీ ఓ మూలస్థంభంలా ఉన్నాడు. అతనే మా కెప్టెన్. ఈ ఫ్రాంఛైజీని నిర్మించిన మెయిన్ పిల్లర్...

జట్టు కోసం మాహీ ఎంతో చేశాడు. ఎంతో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. జట్టును కంట్రోల్ చేసే ఎమ్మెస్ ధోనీ ఎప్పుడూ ఈ ఫ్రాంఛైజీలో కీ రోల్ పోషించాడు....

మాహీ అనుభవం, కెప్టెన్‌గా అతనికి ఉన్న స్కిల్స్ నుంచి జట్టు లాభపడింది. ఇకపై ఆ అనుభవాన్ని ఉపయోగించుకుంటుంది...’ అంటూ చెప్పుకొచ్చాడు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథ్..

ఐపీఎల్ 2022 రిటెన్షన్ పాలసీలో భాగంగా రవీంద్ర జడేజాకి రూ.16 కోట్లు, ఎమ్మెస్ ధోనీకి రూ.12 కోట్లు, మొయిన్ ఆలీ రూ.8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్‌కి రూ.6 కోట్లు చెల్లించి, రిటైన్ చేసుకుంది సీఎస్‌కే...

click me!