వాళ్లవన్నీ అవాస్తవిక అంచనాలే.. ఎప్పుడూ వాళ్లతోనే ఉండాలట.. సొంతజట్టుపై చెన్నై ఓపెనర్ డుప్లెసిస్ కామెంట్స్

First Published Dec 2, 2021, 1:30 PM IST

Faf Du Plesis: ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్.. సొంత జట్టుపైనే సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాళ్లతో ఆడాలంటే నిత్యం అందుబాటులో ఉండాలని రూల్ పెట్టారని కామెంట్ చేశాడు. 

దక్షిణాఫ్రికా ఆటగాడు, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న ఫాఫ్ డుప్లెసిస్ సొంత జట్టుపైనే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుతో ఆడాలంటే నిత్యం  వాళ్లకు అందుబాటులో ఉండాలని రూల్ పెట్టారని ఆవేదన చెందాడు. 

దక్షిణాఫ్రికా జట్టు అతడిని టీ20 జట్టుకు ఎంపిక చేయలేదు. క్రికెట్ సౌతాఫ్రికాతో విభేదాల కారణంగా అతడు  పొట్టి ప్రపంచకప్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా ఇదే విషయమై డూప్లెసిస్  ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 

డూప్లెసిస్ మాట్లాడుతూ... ‘నేనిప్పుడు కొత్త ప్రయాణంలో ఉన్నాను. గతేడాది నేను ఇంగ్లాండ్ తో దక్షిణాఫ్రికా  ఆడిన  సిరీస్ లో ప్రాతినిథ్యం వహించాను. అప్పుడు నేను  టీ20 వరల్డ్ కప్ ఆడతానని భావించాను. పరిస్థితులు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి. 

కానీ మా  క్రికెట్ బోర్డు (క్రికెట్ సౌతాఫ్రికా) మాత్రం విచిత్రమైన వాదనలు వినిపించింది.  జట్టుతో కొనసాగాలంటే విదేశాల్లో జరిగే లీగ్ లకు హాజరుకావొద్దని, ఎప్పుడూ జట్టుకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. 

ఇది నాకు, ఇమ్రాన్ తాహిర్ వంటివాళ్లకు చాలా కష్టం. మేము దక్షిణాఫ్రికాతో పాటు విదేశాల్లో కూడా లీగ్ లు ఆడుతున్నాం. సీఎస్ఏ  ఆదేశాలు మాకు సవాల్ గా మారాయి.  ఒకవేళ వాళ్లు మమ్మల్ని ఈ లీగ్ లకు అనుమతించకుండా ఉంటే అది కచ్చితంగా అవాస్తవ అంచనాలే... ’ అని అన్నాడు. 

అంతేగాక తాను టెస్టు క్రికెట్ నుంచి కూడా వైదొలగడానికి సీఎస్ఏ వైఖరే కారణమని డూప్లెసిస్ చెప్పాడు. వయసు తనకు ఒక నెంబర్ మాత్రమేనని, తాను ఇప్పటికీ ఫిట్ గా ఉన్నానని తెలిపాడు. 

ఇదిలాఉండగా.. రెండ్రోజుల క్రితం ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలో చెన్నె  సూపర్ కింగ్స్ డూప్లెసిస్ ను రిటైన్ చేసుకోలేదు. సుదీర్ఘకాలంగా చెన్నైతో ఆడుతున్న  డూప్లెసిస్..  వచ్చే సీజన్ లో వేలంలోకి వెళ్లే అవకాశముంది. 

click me!