ముంబైతో మ్యాచ్‌కి ముందు సీఎస్‌కేకి ఊహించని షాక్... పెళ్లి కోసం స్వదేశానికి స్టార్ ఓపెనర్...

Published : Apr 21, 2022, 11:21 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కి పెద్దగా కలిసి రావడం లేదు. మొదటి నాలుగు మ్యాచుల్లో వరుస ఓటముల తర్వాత ఐదో మ్యాచ్‌లో గెలిచి ఊపిరిపీల్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాతి మ్యాచ్‌లో మళ్లీ ఓడింది...

PREV
18
ముంబైతో మ్యాచ్‌కి ముందు సీఎస్‌కేకి ఊహించని షాక్... పెళ్లి కోసం స్వదేశానికి స్టార్ ఓపెనర్...

గత సీజన్‌లో 620+ పరుగులు చేసిన దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఫాఫ్ డుప్లిసిస్‌ని వేలానికి వదిలేసిన చెన్నై సూపర్ కింగ్స్... భారీ మూల్యం చెల్లించుకుంది...
 

28

యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ మొదటి ఐదు మ్యాచుల్లో ఫెయిల్ కాగా, ఆరో మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. అయితే అతనితో ఓపెనింగ్ చేసే సరైన బ్యాటర్‌ సీఎస్‌కేకి కనిపించడం లేదు...
 

38

ఫాఫ్ డుప్లిసిస్ లేని లోటు తీరుస్తాడని భావించి, న్యూజిలాండ్ సెన్సేషన్ డివాన్ కాన్వేని వేలంలో కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే కాన్వే, ఐపీఎల్‌ను మధ్యలోనే వీడబోతున్నాడు...

48

న్యూజిలాండ్‌ తరుపున ఆడుతున్న డివాన్ కాన్వే పుట్టింది మాత్రం సౌతాఫ్రికా. ఐపీఎల్‌కి రావడానికి ముందే పెళ్లి ఫిక్స్ చేసుకున్న డివాన్ కాన్వే, సీఎస్‌కే టీమ్‌తో కలిసి ప్రీవెడ్డింగ్ పార్టీ చేసుకున్నాడు...

58

భారతీయ సంప్రదాయ దుస్తుల్లో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీకి సీఎస్‌కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్, మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ, ప్రస్తుత కెప్టెన్ రవీంద్ర జడేజాతో పాటు డ్వేన్ బ్రావో, శివమ్ దూబు, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు వంటి ప్లేయర్లు సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు...

68

పెళ్లి కోసం ఐపీఎల్‌ బయో బబుల్‌ని వీడిన డివాన్ కాన్వే, పెళ్లి తర్వాత భార్యతో కలిసి ఏప్రిల్ 24న తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలవబోతున్నాడు...

78

ఏప్రిల్ 21న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో, ఆ తర్వాత ఏప్రిల్ 25న పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌కీ డివాన్ కాన్వే అందుబాటులో ఉండడం లేదు...

88

ప్రస్తుతం ఆరు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 8 మ్యాచుల్లో 7 విజయాలు అందుకోవాల్సి ఉంటుంది..

click me!

Recommended Stories