Published : May 02, 2022, 03:11 PM ISTUpdated : May 02, 2022, 03:25 PM IST
TATA IPL 2022: ఐపీఎల్ -2022 లో తన బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తన యార్కర్లతో అదరగొడుతున్నాడు. అయితే అతడి నుంచి తప్పించుకోవడానికి సునీల్ గవాస్కర్ అదిరిపోయే సలహా ఇచ్చాడు.
మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఐపీఎల్ లో తన సూపర్ బౌలింగ్ తో అదరగొడుతున్న ఉమ్రాన్ మాలిక్ వేగానికి ప్రత్యర్థి జట్ల బ్యాటర్లు బెదిరిపోతున్నారు. ఈ సీజన్ ప్రారంభం నుంచి ప్రతి మ్యాచ్ లో గంటకు 150 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేస్తున్న అతడు యార్కర్లు వేస్తే వికెట్లు నేల కూలాల్సిందే.
27
తన వేగానికి లెంగ్త్ బంతులు విసిరితే బ్యాటర్ దగ్గర సమాధానమే ఉండట్లేదు. కేకేఆర్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఇందుకు సంబంధించి బ్యాటర్లు బాధితులుగా కూడా మారారు.
37
ఈ కాశ్మీరి సంచలనం నుంచి తప్పించుకోవడమెలాగో బ్యాటర్లకు తెలియడం లేదు. అయితే వాళ్లకు భారత క్రికెట్ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ అదిరిపోయే సలహా ఇచ్చాడు. ఆదివారం చెన్నైతో హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు.
47
గవాస్కర్ మాట్లాడుతూ... ‘ఉమ్రాన్ తుఫాన్ నుంచి తప్పించుకోవాలంటే మీరు సింగిల్ తీసి నాన్ స్ట్రైకర్స్ ఎండ్ కు వెళ్లి నిల్చోండి.. అప్పుడే మీరు సేవ్ అయితారు..’ అని ఫన్నీగా సూచించాడు.
57
అంతేగాక.. ‘మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఉమ్రాన్ కు వికెట్లు కనబడనీయకండి. ఉమ్రాన్ పరిగెత్తుకుంటూ వచ్చేప్పుడు మొత్తం మూడు స్టంప్ లను కవర్ చేయండి. అప్పుడతడు ఏ స్టంప్ కు బాల్ చేయాలో తెలియదు. ఆఫ్ స్టంప్ ఏదో, లెగ్ స్టంప్ ఏదో తెలియక కన్ఫ్యూజ్ అవుతాడు.’ అని చెప్పుకొచ్చాడు.
67
కాగా ఈ సీజన్ లో ఇప్పటివరకు 9 మ్యాచులాడిన ఉమ్రాన్.. 15 వికెట్లు తీశాడు. ఆడిన తొమ్మిది మ్యాచులలో అన్నింటా ఫాస్టెస్ట్ డెలివరీలు అతడివే. ఇక చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా గంటకు 154 కిలోమీటర్ల వేగంతో రెండు బంతులు వేశాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇదే ఫాస్టెస్ట్ డెలివరీ.
77
ఇక చెన్నైతో మ్యాచ్ లో కాస్త లయతప్పాడు ఉమ్రాన్. నాలుగు ఓవర్లు వేసిన అతడు.. 48 పరుగులిచ్చాడు. వికెట్ కూడా తీయలేకపోయాడు. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ ను రుతురాజ్ గైక్వాడ్ ఆటాడుకున్నాడు. తొలి రెండు ఓవర్లు ధారాళంగా పరుగులిచ్చిన మాలిక్.. తన చివరి రెండు ఓవర్లలో పొదుపుగా బౌలింగ్ చేశాడు.