Babar Azam: ‘డబుల్’ మిస్ అయినా.. కోహ్లి, లారా, బ్రాడ్మన్ ల రికార్డును బ్రేక్ చేసిన పాక్ సారథి..

Published : Mar 17, 2022, 10:08 AM IST

Pakistan Vs Australia: కరాచీ వేదికగా ముగిసిన పాకిస్థాన్-ఆస్ట్రేలియా రెండో టెస్టులో బాబర్ ఆజమ్ వీరోచితంగా పోరాడాడు. నాలుగు పరుగులతో డబుల్ సెంచరీ మిస్ అయినా అతడు పలు రికార్డులను బద్దలు కొట్టాడు. 

PREV
17
Babar Azam: ‘డబుల్’ మిస్ అయినా.. కోహ్లి, లారా, బ్రాడ్మన్ ల రికార్డును బ్రేక్ చేసిన పాక్ సారథి..

పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్ బుధవారం ఆస్ట్రేలియాతో ముగిసిన కరాచీ టెస్టులో నాలుగు పరుగులతో  డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. సుమారు 10 గంటల పాటు బ్యాటింగ్ చేసిన బాబర్..  భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వ్యక్తిగతంగా పలు రికార్డులను బద్దలు కొట్టాడు. 

27

ఆస్ట్రేలియా నిర్దేశించిన 506 పరుగుల లక్ష్యంలో...  బాబర్ ఆజమ్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి 196 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి తో పాటు విండీస్ మాజీ  ఆటగాడు బ్రియాన్ లారా, ఆసీస్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్, ఇంగ్లాండ్ దిగ్గంజ మైఖేల్ అథర్టన్ ల రికార్డును బద్దలు కొట్టాడు. 

37

నాలుగో ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా బాబర్ రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో అతడు మైఖెల్ అథర్టన్ (185 నాటౌట్), డాన్ బ్రాడ్మన్ (173 నాటౌట్), రికీ పాంటింగ్ (156), విరాట్ కోహ్లి (141), గ్రేమ్ స్మిత్ (154 నాటౌట్), బ్రియాన్ లారా (153 నాటౌట్) లను అధిగమించాడు. 

47

కెప్టెన్ గా నాలుగో ఇన్నింగ్స్ లో బాబర్..  ఆస్ట్రేలియాపై  425 బంతులాడి 196 పరుగులు చేశాడు. దీంతో పైన పేర్కొన్న రికార్డులన్నీ ఆజమ్ అధిగమించి కొత్త చరిత్ర సృష్టించాడు.  మరో నాలుగు పరుగులు చేసుంటే నాలుగో ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన  తొలి సారథిగా అతడు రికార్డులకెక్కేవాడు. 

57

భారత మాజీ సారథి విరాట్ కోహ్లి 2014లో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా.. అడిలైడ్ లో జరిగిన టెస్టులో నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చి 141 పరుగులు సాధించాడు. 

67

ఇదిలాఉండగా.. టెస్టు మ్యాచులో పాక్ తరఫున (స్వదేశంలో) ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక బంతులు ఆడిన   బ్యాటర్ గా కూడా రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు షోయభ్ మాలిక్ (369) పేరిట ఉండేది. ఆసీస్ తో  కరాచీ టెస్టులో బాబర్.. ఏకంగా 425 బంతులాడాడు. 

77

అంతేగాక పాక్ తరఫున నాలుగో ఇన్నింగ్స్ లో  అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్ గా కూడా బాబర్ రికార్డులకెక్కాడు.  గతంలో యూనిస్ ఖాన్.. 2015లో శ్రీలంకపై 171 పరుగులు చేయగా ఇప్పుడు బాబర్ ఆ రికార్డును కూడా చెరిపేశాడు.  

Read more Photos on
click me!

Recommended Stories