ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీకి చాలామంది క్రికెటర్లు కూడా అభిమానులుగా మారిపోయారు...
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రికెటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీకి చాలామంది క్రికెటర్లు కూడా అభిమానులుగా మారిపోయారు...
28
అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన విరాట్ కోహ్లీ, ఎందరో యువ క్రికెటర్లకు ఫెవరెట్ క్రికెటర్. విరాట్ ఫామ్‌లో ఉంటే ఆపడం ఎవ్వరి తరం కాదు...
38
ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కూడా విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కి అభిమానే. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే 3 సెంచరీలు చేసిన జోస్ బట్లర్, ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నాడు...
48
విరాట్ కోహ్లీ మాత్రం ఈ సీజన్‌లో పరుగులు చేయడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. 14 మ్యాచుల్లో 2 హాఫ్ సెంచరీలతో 23.77 యావరేజ్‌తో 309 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ...
58
రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం, ఆరెంజ్ క్యాప్ హోల్డర్ జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లి బ్యాటింగ్ టిప్స్ అడిగాడట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు విరాట్ కోహ్లీ...
68
‘రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ తర్వాత జోస్ బట్లర్ నా దగ్గరికి వచ్చి బ్యాటింగ్ టిప్స్ చెప్పమని అడిగాడు. నాకు నవ్వొచ్చింది... నువ్వు ఆరెంజ్ క్యాప్ వేసుకున్నావ్, నేను పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్నా. నా దగ్గర నువ్వేం నేర్చుకుంటావ్... అన్నాను.... కాసేపు ఇద్దరం నవ్వుకున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
78
ఐపీఎల్ 2022 సీజన్‌లో 13 మ్యాచుల్లో 52.25 సగటుతో 627 పరుగులు చేశాడు జోస్ బట్లర్. రాజస్థాన్ రాయల్స్, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బట్లర్ 8 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
88
సీజన్ ఫస్టాఫ్‌లో 7 మ్యాచుల్లో 3 సెంచరీలు చేసి, 2016లో విరాట్ కోహ్లీ నెలకొల్పిన 973 పరుగుల రికార్డును బ్రేక్ చేస్తాడేమోనని అనిపించాడు జోస్ బట్లర్. అయితే సెకండాఫ్‌లో పరుగులు చేయడానికి తెగ ఇబ్బందిపడిన బట్లర్, విరాట్ రికార్డుకి చాలా దూరంలో నిలిచాడు...