ప్లేఆఫ్స్ రేసును ఇంట్రెస్టింగ్‌గా మార్చేసిన సీఎస్‌కే... ఆ ఒక్క టీమ్‌కి తప్ప అన్నీ జట్లకీ దడే...

Published : May 09, 2022, 04:08 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకుందని అనుకున్న చెన్నై సూపర్ కింగ్స్, అన్యూహ్యంగా మళ్లీ పోటీలోకి దూసుకొచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న మాహీ టీమ్, ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్ రేసును చాలా ఇంట్రెస్టింగ్‌గా మార్చేసింది...

PREV
111
ప్లేఆఫ్స్ రేసును ఇంట్రెస్టింగ్‌గా మార్చేసిన సీఎస్‌కే... ఆ ఒక్క టీమ్‌కి తప్ప అన్నీ జట్లకీ దడే...

ఐపీఎల్ 2022 సీజన్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఇంకా అధికారికంగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేదు. 10 ఫ్రాంఛైజీలు ఆడుతున్న లీగ్ కావడంతో 8 విజయాలు సాధిస్తే, ప్లేఆఫ్స్‌కి వెళ్లిపోవచ్చనేది గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి...

211

12 మ్యాచుల్లో 7 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే 18 పాయింట్లతో టాప్‌లోకి దూసుకెళ్తుంది. అప్పుడు ఆర్‌సీబీ మ్యాచ్ ఆడాల్సిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ కూడా కిందకి దిగజారాల్సి ఉంటుంది...

311

ఇప్పటికే 8 వరుస పరాజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. 9వ స్థానంలో ఉన్న కేకేఆర్‌తో పాటు 8వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ఏడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌కి కూడా ఇంకా ప్లేఆఫ్స్ గేట్స్ తెరిచే ఉన్నాయి...

411

కేకేఆర్ తన తర్వాతి మ్యాచుల్లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచులు ఆడనుంది. ఈ మూడు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంటే కేకేఆర్... టాప్ 4లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఛాన్సులు ఉంటాయి...

511

అలాగే ఆలస్యంగా ఫామ్‌లోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా తన తర్వాతి మ్యాచుల్లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచులు ఆడనుంది. ఈ మూడింట్లో గెలిస్తే ఎమ్మెస్ ధోనీ టీమ్ కూడా ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకురావచ్చు..

611

సీఎస్‌కే మ్యాచులో చిత్తుగా ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్... తన తర్వాతి మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచులు ఆడనుంది. ఈ మూడింట్లో విజయాలు అందుకుంటే 8 విజయాలతో టాప్ 4లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఢిల్లీకి ఛాన్సులు పెరుగుతాయి...

711

ఆర్‌సీబీ చేతుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు... తన తర్వాతి మ్యాచుల్లో కేకేఆర్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచులు ఆడబోతోంది. ప్రస్తుతం 5 విజయాలతో ఉన్న ఆరెంజ్ ఆర్మీ, ఈ మూడు మ్యాచుల్లో గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ 4లోకి దూసుకెళ్తుంది...

811

పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. పంజాబ్ తన తర్వాతి మ్యాచుల్లో ఆర్‌సీబీ, డిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లతో మ్యాచులు ఆడనుంది. ఈ మూడు గెలిస్తే పంజాబ్ కింగ్స్ కూడా 8 విజయాలు ఖాతాలో వేసుకుని టాప్ 4లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది...

911

అయితే కేకేఆర్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ ఛాన్సులను ముంబై ఇండియన్స్ డిసైడ్ చేయనుంది. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ముంబై, ఈ జట్లతో జరిగే మ్యాచుల్లో గెలిస్తే, వాటి ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీయగలుగుతుంది...

1011

వరుసగా 8 పరాజయాల తర్వాత రెండు వరుస విజయాలతో ఫామ్‌లోకి వచ్చిన ముంబై ఇండియన్స్, పాయింట్ల పట్టికలో ఆఖరి పొజిషన్ నుంచి తప్పుకోవాలని ఫిక్స్ అయితే ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన ఒక్కో జట్టుని కిందికి లాగేయాల్సిందే...

1111

అలాగే లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో ప్లేఆఫ్స్‌కి అధికారికంగా అర్హత సాధించే మొదటి జట్టు ఏదో తేలిపోనుంది. ఆ జట్టు మినహా మిగిలిన అన్ని జట్లనీ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ దడ పుట్టించబోతోంది...

click me!

Recommended Stories