ఆ రోజు ద్రావిడ్ మాట వినకుండా ఉండాల్సింది, లేదంటే ఈపాటికి... వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

Published : Aug 21, 2021, 12:58 PM IST

చాలామంది క్రికెటర్లు సెంచరీకి చేరువైన తర్వాత సింగిల్స్ తీస్తూ, సేఫ్ గేమ్ ఆడితే... వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం సిక్సర్లు బాదడానికే ఆసక్తి చూపించేవాడు. టీమిండియాలోనే కాదు, క్రికెట్ ప్రపంచంలోనే వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ ఓ సంచలనం. టెస్టులను కూడా వన్డేల్లా ఆడే సెహ్వాగ్ చేసిన ఓ కామెంట్‌ను గుర్తు చేసుకున్నాడు శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్...

PREV
111
ఆ రోజు ద్రావిడ్ మాట వినకుండా ఉండాల్సింది, లేదంటే ఈపాటికి...  వీరేంద్ర సెహ్వాగ్ కామెంట్...

వరల్డ్‌ క్రికెట్‌లో బెస్ట్ టెస్టు ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. సెహ్వాగ్ క్రీజులో ఉన్నాడంటే ఫార్మాట్‌తో సంబంధం లేకుండా స్కోరు బోర్డు ఉరుకులు, పరుగులు పెట్టాల్సిందే... 

211

టెస్టుల్లో టీమిండియా తరుపున రెండు త్రిబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్, ఓ మ్యాచ్‌లో 293 పరుగుల వద్ద అవుటై... మూడో త్రిశతకాన్ని మిస్ చేసుకున్నాడు....

311

2009లో ముంబైలో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 293 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. ‘నాకు ఆ మ్యాచ్ ఇంకా గుర్తింది... ఆ రోజు ముంబైలో జరిగిన మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 290 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు...

411

ఈవెనింగ్ సెషన్‌లో వీరూ, దగ్గరికి వచ్చిన రాహుల్ ద్రావిడ్... ‘ఈ రోజు వికెట్ కాపాడుకో... రేపు మెల్లిగా త్రిబుల్ సెంచరీ చేసుకోవచ్చు...’ అని చెప్పాడు. వీరూ ఆ మాటకు విలువనిచ్చి, సాయంత్రం సెషన్‌లో మిగిలిన ఓవర్లు స్లోగా బ్యాటింగ్ చేశాడు...
తర్వాతి రోజు ఉదయం సెషన్‌లో నా బౌలింగ్‌లో షాట్ ఆడబోయి, నాకే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 

511

అతను పెవిలియన్‌కి వెళ్లేముందు... ‘నేను రాహుల్ ద్రావిడ్ మాట అస్సలు వినకుండా ఉండాల్సింది... లేదంటే ఈపాటికి త్రిబుల్ సెంచరీ కొట్టేసేవాడిని...’ అంటూ కామెంట్ చేశాడు...

611

వీరేంద్ర సెహ్వాగ్ నా బౌలింగ్‌ను చక్కగా అర్థం చేసుకుంటాడు. అతను నా బౌలింగ్‌లో అప్పటికే భారీగా పరుగులు చేశాడు. అయితే ఆ షాట్ మాత్రం మరోలా ఆడాలని ప్రయత్నించి, అవుట్ అయ్యాడు...

711

వీరేంద్ర సెహ్వాగ్ చాలా డేంజరస్ బ్యాట్స్‌మెన్. నేను చాలాసార్లు ఈ విషయం చెప్పాను. అతను క్రీజులో ఉంటే పరుగులను ఆపడం ఎవ్వరి తరం కాదు... 2 గంటల్లో 150 పరుగులు చేస్తాడు... రోజంతా బ్యాటింగ్ చేస్తే... 300 కొట్టే వెళ్తాడు...

811

చాలామంది బ్యాట్స్‌మెన్లు 98,99 పరుగుల వద్దకి చేరుకున్నాక సింగిల్స్ తీయాలని ఆలోచిస్తారు, కానీ సెహ్వాగ్ మాత్రమే సిక్సర్ కొట్టాలని చూస్తాడు. అతను సెంచరీ వచ్చిందా? లేదా? అని ఆలోచించడు. ఆ బంతికి సిక్సర్ కొట్టామా? లేదా? అనేదే అతనికి ముఖ్యం...’ అంటూ కామెంట్ చేశాడు ముత్తయ్య మురళీధరన్...

911

ముంబైలో జరిగిన మూడో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 393 పరుగులకి ఆలౌట్ అయ్యింది. దిల్షాన్ సెంచరీతో ఆకట్టుకోగా హర్భజన్ సింగ్ నాలుగు, ఓజా మూడువికెట్లు తీశారు...

1011

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 726/9 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మురళీ విజయ్ 87, రాహుల్ ద్రావిడ్ 74, సచిన్ టెండూల్కర్ 53, వీవీఎస్ లక్ష్మణ్ 62 పరుగులు చేయగా వీరేంద్ర సెహ్వాగ్ 254 బంతుల్లో 40 ఫోర్లు, 7 సిక్సర్లతో 293 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

1111

మహేంద్ర సింగ్ ధోనీ 154 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముత్తయ్య మురళీధరన్ నాలుగు వికెట్లు తీయగా, రంగనా హేరాత్ 3 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో లంక 309 పరుగులకి ఆలౌట్ కావడంతో టీమిండియాకి ఇన్నింగ్స్ 24 పరుగుల తేడాతో ఘన విజయం దక్కింది..

click me!

Recommended Stories