IPL 2021: అదరగొట్టిన అయ్యర్... పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్...

Published : Oct 01, 2021, 09:21 PM IST

టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలంటే పంజాబ్ కింగ్స్ 120 బంతుల్లో 166 పరుగులు చేయాల్సి ఉంటుంది...

PREV
18
IPL 2021:  అదరగొట్టిన అయ్యర్... పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్...

కేకేఆర్‌కి శుభారంభం దక్కలేదు. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ను అర్ష్‌దీప్ సింగ్ బౌల్డ్ చేశాడు. 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది కోల్‌కత్తా...

28

ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి, వెంకటేశ్ అయ్యర్ కలిసి రెండో వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 26 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠిని రవి భిష్ణోయ్ అవుట్ చేశాడు...

38

49 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 67 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్ కూడా రవిభిష్ణోయ్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు.

48

ఫేజ్ 2లో ఐదు మ్యాచులు ఆడిన వెంకటేశ్ అయ్యర్, కేకేఆర్ తరుపున మొదటి ఐదు మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు..

58

రోహిత్ శర్మ 235, గౌతమ్ గంభీర్ 224, వీరేంద్ర సెహ్వాగ్ 207, పాల్ వాల్తేటి 207, పృథ్వీషా 205 పరుగులతో వెంకటేశ్ అయ్యర్ కంటే ముందున్నారు...

68

14 ఓవర్లలోనే 120 పరుగులు చేసిన కేకేఆర్, 180+ పరుగులు చేసేలా కనిపించింది. అయితే వెంకటేశ్ అయ్యర్ అవుటైన తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

78

ఇయాన్ మోర్గాన్ 2 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరచగా... నితీశ్ రాణా 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులతో మెరుపులు మెరిపించి పెవిలియన్ చేరాడు..

88

మొదటి మ్యాచ్ ఆడుతున్న టిమ్ సిఫర్ట్ 2 పరుగులు చేసి రనౌట్ కాగా దినేశ్ కార్తీక్ 11 బంతుల్లో 11 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు...

click me!

Recommended Stories