ఆ రోజు అశ్విన్ చేసిన పనికి ధోనీ కోపడ్డాడు... ఐపీఎల్‌లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్న వీరేంద్ర సెహ్వాగ్...

First Published Oct 1, 2021, 8:35 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్, ఇయాన్ మోర్గాన్ మధ్య జరిగిన గొడవ గురించి సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చే నడుస్తోంది. క్రీడాస్ఫూర్తి గురించి క్రికెట్ ప్రపంచం రెండుగా చీలిపోయింది కూడా. తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ సంఘటన గురించి మాట్లాడాడు...

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఫీల్డర్ విసిరిన బంతి, అశ్విన్‌కి తాకి వెళ్లింది. దాంతో అశ్విన్ మరో ఎక్స్‌ట్రా రన్ తీయడానికి పరుగెత్తాడు. ఇదే అశ్విన్‌కీ, మోర్గాన్‌కీ మధ్య గొడవ జరగడానికి కారణమైంది...

‘2014లో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరిగింది. ఆ సీజన్‌లో నేను పంజాబ్ కింగ్స్ తరుపున ఆడాను. అశ్విన్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌ను అవుట్ చేశాడు...

అయితే మ్యాక్స్‌వెల్‌ను అవుట్ చేసిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్... చేతితో మట్టిని తీసుకుని, గాల్లోకి ఊదుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అది నాకు నచ్చలేదు... 

నేను పబ్లిక్‌గా ఆ విషయాన్ని చెప్పలేదు. వికెట్ తీసినంత మాత్రాన అలా చేయకుండా ఉండాల్సిందని నాకు అనిపించింది.. అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం... ప్రత్యర్థి క్రీడాకారుడిని అవమానించినట్టే...

నాలాగే సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఫీల్ అయ్యాడు. అలా చేసినందుకు అశ్విన్‌ను కోపడ్డాడు, అలా చేయొద్దంటూ గ్రౌండ్‌లోనే తిట్టాడు... అలా చేస్తే తప్పు...

కానీ మోర్గాన్‌తో జరిగిన దాంట్లో నాకు అశ్విన్‌ తప్పేమీ కనిపించలేదు... ఎవరు లోపల ఏమనుకుంటున్నారో వారి లోపలే ఉంచుకోవాలి. మనసులో వచ్చిన ప్రతీ మాటను బయటపెడితే, రిజల్ట్ అన్నిసార్లు సరిగ్గా ఉండకపోవచ్చు..

మోర్గాన్, అశ్విన్‌కి క్రీడాస్ఫూర్తి గురించి చెప్పి ఉంటే... చెప్పనీ... అంతేకానీ ఇలాగే ఉండాలని చెప్పే అధికారం అతనికి లేదు... అది అక్కడితో ఆ మ్యాచ్‌తో అయిపోయింది. ఇక వదిలేయండి. 

అంతేకానీ ఇలా అశ్విన్ క్రీడాస్ఫూర్తిని ప్రశ్నిస్తూ... మీడియా రచ్చ చేయాల్సిన అవసరం లేదు... ఇది కరెక్ట్ కాదు ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్... 

‘అయినా ఓవర్‌త్రోకి పరుగు తీయకూడదని చెప్పే మోర్గాన్, వన్డే వరల్డ్‌కప్‌ని తీసుకోకుండా లార్డ్ స్టేడియం బయట కూర్చొని ధర్నా చేయాల్సింది కదా... మీరా క్రీడా స్ఫూర్తి గురించి చెప్పడానికి వచ్చింది...’ అంటూ కేకేఆర్ కెప్టెన్‌కి పంచ్ ఇచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్...

click me!