ఐపీఎల్‌ 2021పై టెస్టు ఛాంపియన్‌షిప్ ఎఫెక్ట్... షెడ్యూల్ మరింత ముందుకి...

First Published Mar 7, 2021, 11:13 AM IST

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి టీమిండియా అర్హత సాధించిన విషయం తెలిసిందే. జూన్ 18 నుంచి ఇంగ్లాండ్‌లో లార్డ్స్ మైదానంలో ఇండియా, న్యూజలాండ్ మధ్య టెస్టు ఛాంపియన్‌షిప్ టైటిల్ ఫైట్ జరగనుంది. దీంతో టెస్టు ప్రాక్టీస్‌ కోసం ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఐపీఎల్ 2021 సీజన్‌ను మరింత ముందుకు జరపాలని భావిస్తున్నారట.

ఏప్రిల్ 11 నుంచి ఐపీఎల్ సీజన్ 14ను ప్రారంభించి, జూన్ 5 లేదా 6 తేదీల్లో ఫైనల్ మ్యాచ్ జరపాలని భావించింది బీసీసీఐ. అయితే జూన్ 6న ముగిస్తే ఆటగాళ్లకు ఇంగ్లాండ్ వెళ్లేందుకు, క్వారంటైన్ ముగించుకుని ప్రాక్టీస్ మొదలెట్టేందుకు తగినంత సమయం ఉండదు.
undefined
కాబట్టి ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ సీజన్ 14 ప్రారంభించాలని భావిస్తోంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ యాజమాన్యం. 52 రోజుల పాటు సాగే ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 30న జరగబోతున్నట్టు సమాచారం...
undefined
ఇప్పటికే ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను రూపొందించిన ఐపీఎల్ యాజమాన్యం, గవర్నింగ్ సమావేశంలో దీనిని ఆమోదించబోతోంది. దీంతో వచ్చే వారం ఐపీఎల్ సీజన్ 14కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది...
undefined
మొదటముంబై, పూణె నగరాల్లో ఐపీఎల్ సీజన్ 14 మ్యాచులు నిర్వహించాలని భావించినా, ఈ నగరాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతండడంతో ప్లాన్ మార్చింది బీసీసీఐ....
undefined
ఐపీఎల్ 2021 సీజన్ నిర్వహణ కోసం అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబై నగరాలను షార్ట్ లిస్టు చేశాయి. అయితే దీనిపై పంజాబ్, రాజస్థాన్, హైదరాబాద్ ఫ్రాంఛైజీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి...
undefined
click me!