డేవిడ్ మలాన్ అవుట్... నిమిషాల్లో కొత్త ప్లేయర్‌ని పట్టుకొచ్చిన పంజాబ్ కింగ్స్...

First Published Sep 11, 2021, 5:06 PM IST

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు అర్ధాంతరంగా రద్దు కావడంతో ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం ఐపీఎల్ 2021 ఫేజ్‌ 2పైకి మళ్లింది. అయితే ఐదో టెస్టును రద్దు చేశారనే కోపంతో ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు ముగ్గురు ఇంగ్లండ్ క్రికెటర్లు...

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టోతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ డేవిడ్ మలాన్... ఐపీఎల్ 2021 ఫేజ్ 2 నుంచి తప్పుకున్నారు...

‘టీ20 వరల్డ్‌కప్ 2021, యాషెస్ సిరీస్‌కి ముందు కుటుంబంతో కలిసి సరదాగా గడపాలని అనుకుంటున్నా... అందుకే ఐపీఎల్ 2021 ఫేజ్ 2కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు డేవిడ్ మలాన్...

అయితే ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2 నుంచి తప్పుకుంటున్నట్టు డేవిడ్ మలాన్ ప్రకటించిన నిమిషాల్లోనే రిప్లేస్‌మెంట్‌గా మరో ప్లేయర్‌ను ప్రకటించింది పంజాబ్ కింగ్స్...

సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్కమ్‌ను, డేవిడ్ మలాన్ స్థానంలో ఎంపిక చేసినట్టు ప్రకటించింది పంజాబ్ కింగ్స్...

ఈ మధ్యకాలంలో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న మార్కమ్, గత 10 ఇన్నింగ్స్‌ల్లో 39 సగటుతో, 153 స్ట్రైయిక్ రేటుతో ఐదు హాఫ్ సెంచరీలు సాధించాడు...

టీ20ల్లో నెం.1 ర్యాంకు సాధించిన డేవిడ్ మలాన్‌ను చాలా చవగ్గా కోటిన్నరకే కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, అతన్ని ఫస్ట్ ఫేజ్‌లో ఒకే ఒక్క మ్యాచ్ ఆడించింది...

ఆ మ్యాచ్‌లో 26 పరుగులు చేశాడు డేవిడ్ మలాన్. కెఎల్ రాహుల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, మయాంక్ అగర్వాల్ వంటి భారీ హిట్టర్లతో నిండిన పంజాబ్ కింగ్స్‌లో మార్కమ్‌కి అవకాశం దక్కడం కూడా అనుమానమే...

డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్, జానీ బెయిర్‌స్టోతో కలిపి మొత్తంగా ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ నుంచి తప్పుకున్న ఇంగ్లాండ్ ప్లేయర్ల సంఖ్య ఆరుకి చేరింది...

ఇప్పటికే గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్, మెంటల్ హెల్త్ కోసం క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకున్న బెన్ స్టోక్స్, వ్యక్తిగత కారణాలతో జోస్ బట్లర్... ఐపీఎల్ 2021 నుంచి తప్పుకున్నారు.
 

click me!