IPL 2021: రాజస్థాన్ రాయల్స్‌కి షాక్... వ్యక్తిగత కారణాలతో కీలక ప్లేయర్ దూరం...

Published : Aug 22, 2021, 10:09 AM IST

రాజస్థాన్ రాయల్స్‌కి ఐపీఎల్ 2021 ఫేజ్ 2 మొదలుకాకముందే ఊహించని షాక్ తగిలింది. ఫేజ్ 1 ఆరంభంలోనే బెన్ స్టోక్స్ గాయంతో దూరం కావడం, ఆ తర్వాత కరోనా భయంతో ఒక్కొక్కరు విదేశీ ప్లేయర్లు, స్వదేశానికి పయనం కావడంతో అనేక ఇబ్బందులు పడింది రాజస్థాన్ రాయల్స్...

PREV
19
IPL 2021: రాజస్థాన్ రాయల్స్‌కి షాక్... వ్యక్తిగత కారణాలతో కీలక ప్లేయర్ దూరం...

టీ20 వరల్డ్‌కప్‌కి ముందు జరిగే ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్‌లో పాల్గొనడానికి విదేశీ ప్లేయర్లు ఆసక్తి చూపించడంతో ఈసారి... రాయల్స్ కూడా ఫారిన్ స్టార్లతో కళకళలాడుతుందని భావించారందరూ...

29

అయితే బెన్ స్టోక్స్, ఇంగ్లాండ్- ఇండియా టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే... 

39

బయో బబుల్ లైఫ్‌కి అలవాటు పడలేక మెంటల్ హెల్త్ కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి నిరవధిక బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు బెన్‌స్టోక్స్...

49

తాజాగా ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ కూడా వ్యక్తిగత కారణాలతో క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు...

59

జోస్ బట్లర్ భార్య త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. ఆమెకు తోడుగా ఉండేందుకు నిర్ణయం తీసుకున్న జోస్ బట్లర్, ఐపీఎల్ 2021 ఫేజ్ 2కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు...

69

ఐపీఎల్ తర్వాత జరిగే టీ20 వరల్డ్‌కప్‌లో బట్లర్ రీఎంట్రీ ఇచ్చినా... ఆ తర్వాత జరిగే యాషెస్ సిరీస్‌కి కూడా అతను దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం...

79

ఐపీఎల్ 2021 ఫేజ్ 1లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్ బట్లర్ భారీ సెంచరీ చేశాడు. 64 బంతుల్లో 124 పరుగులు చేసిన బట్లర్, 7 మ్యాచుల్లో 254 పరుగులు చేశాడు... 

89

జోస్ బట్లర్‌కి ముంబై ఇండియన్స్‌కి 75 యావరేజ్ ఉంది. అలాగే సీఎస్‌కేపై 66.25 సగటుతో పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్‌పై కూడా మంచి రికార్డు ఉంది. బట్లర్ లేకపోవడంతో రాజస్థాన్ విజయావకాశాలపై ప్రభావం చూపించవచ్చు...

99

ఈ సీజన్‌లో సంజూ శాంసన్ కెప్టెన్సీలో 7 మ్యాచులు ఆడిన రాజస్థాన్ రాయల్స్, మూడింట్లో విజయాలు అందుకుంది. నాలుగింట్లో ఓడి... పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది...

click me!

Recommended Stories