డ్రెస్సింగ్ రూమ్‌లో రికీ పాంటింగ్ మాటలు వింటుంటే... సెన్సేషనల్ యంగ్ బౌలర్ ఆవేశ్ ఖాన్ వ్యాఖ్యలు...

First Published Oct 2, 2021, 5:46 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో వెలుగులోకి వచ్చిన యంగ్ స్టార్లలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ ఆవేశ్ ఖాన్ ఒకడు. ఫస్టాఫ్‌లో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ వంటి భారత స్టార్ ప్లేయర్ల వికెట్లు తీసి ఆకట్టుకున్న ఆవేశ్ ఖాన్, ఇంగ్లాండ్ టూర్‌లో చోటు దక్కించుకున్నాడు. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన ఆవేశ్ ఖాన్, సిరీస్‌లో ఆడలేకపోయాడు...

ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో ఇంప్రెసివ్ పర్ఫామెన్స్ ఇచ్చిన ఆవేశ్ ఖాన్, సెకండాఫ్‌లోనూ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు... ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ సన్సేషనల్ స్పెల్‌తో డిఫెండింగ్ ఛాంపియన్‌కి షాక్ ఇచ్చాడు...

4 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చిన ఆవేశ్ ఖాన్, రోహిత్ శర్మ వికెట్ తీసి ఢిల్లీ క్యాపిటల్స్‌‌కి తొలి బ్రేక్ అందించాడు... ఆ తర్వాత హార్ధిక్ పాండ్యా, నాథన్ కౌంటర్‌నైల్‌లను ఒకే ఓవర్‌లో బౌల్డ్ చేసి అదరగొట్టాడు...

ఈ సీజన్‌లో ఇప్పటికే 21 వికెట్లు తీసిన ఆవేశ్ ఖాన్, పర్పుల్ క్యాప్ రేసులో హర్షల్ పటేల్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న టాప్ 5 ప్లేయర్లు కూడా భారత బౌలర్లే కావడం మరో విశేషం...

‘రికీ పాంటింగ్ సర్‌తో ఇది నాలుగో సంవత్సరం. ఆయన ఓ లెజెండరీ క్రికెటర్, అంతకుమించి గొప్ప కోచ్ కూడా... గేమ్‌లో మానసిక విషయాల ప్రాముఖ్యం గురించి రికీ పాంటింగ్ మాట్లాడుతూ ఉంటారు...

డ్రెస్సింగ్ రూమ్‌లో రికీ పాంటింగ్ మాటలు వింటుంటే... వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. పాంటింగ్ సర్ ఎందుకు అంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అయ్యాడో ఆయన మాటలు వింటుంటే అర్థమవుతుంది... 

ఎంతో ఓపెన్ మైండ్‌తో మాట్లాడే రికీ పాంటింగ్, ప్రతీ విషయం గురించి ఎంతో ఫ్రీగా చెబుతారు. నేను నెట్స్‌లో యార్కర్లు వేయడానికి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటా... 

యార్కర్లతోనే ఎక్కువగా వికెట్లు తీయడానికి అవకాశం దొరుకుతుంది. అందుకే బాటిల్‌తో, లేదా షూస్ పెట్టి పర్ఫెక్ట్ యార్కర్ పడేలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటా...

యార్కర్, షూకి తాకిన ప్రతీసారి నా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది... మా జట్టులోని రబాడా, నోకియాల నుంచి కూడా ఎంతో నేర్చుకుంటున్నా. పిచ్‌ని బట్టి ఎలా బౌలింగ్ చేయాలో వాళ్లను అడిగి తెలుసుకుంటూ ఉంటా...’ అంటూ కామెంట్ చేశాడు ఆవేశ్ ఖాన్..

click me!