సిక్స్ కొట్టి, సెలబ్రేట్ చేసుకుంటారా, మీదో పిల్ల బచ్చా టీమ్‌... ఆర్‌సీబీపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కామెంట్స్

First Published Sep 27, 2021, 5:06 PM IST

ఐపీఎల్‌లో ఎన్ని టీమ్స్ ఉన్నా, ఆర్‌సీబీ క్రేజ్ వేరు. సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ వంటి జట్లు టైటిల్స్ గెలిచిన తర్వాత క్రేజ్ వస్తే, 13 సీజన్లలో ఒక్క టైటిల్ గెలవలేకపోయినా క్రేజ్ విషయంలో ఆర్‌సీబీ రేంజ్ వేరు... 

ఐపీఎల్ 2021 సీజన్‌ను వరుసగా నాలుగు విజయాలతో ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... అభిమానుల ‘ఈ సాలా కప్ నమ్‌దే’ కోరికను తీర్చేసేలాగే కనిపించింది...

అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది... సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన రాయల్ ఛాలెంజర్స్, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగులకే ఆలౌట్ అయి...‘వింటేజ్’ఆర్‌సీబీని గుర్తుకుతెచ్చింది...

Latest Videos


మొదటి నాలుగు మ్యాచుల తర్వాత జరిగిన ఐదు మ్యాచుల్లో నాలుగింట్లో ఓడిన రాయల్ ఛాలెంజర్స్... ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి డామినేషన్ చూపించి, 54 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది...

ఐపీఎల్‌ చరిత్రలో మొట్టమొదటిసారి ముంబై ఇండియన్స్‌ను ఆలౌట్ చేసింది ఆర్‌సీబీ. అంతేనా ఒకే సీజన్‌లో రెండుసార్లు ముంబై ఇండియన్స్‌ను ఓడించడం కూడా ఇదే తొలిసారి...

అయితే ఆర్‌సీబీ ఆటతీరుపై మాత్రం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాగన్ షాకింగ్ కామెంట్లు చేశాడు.. ‘రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెంటాలిటీతోనే అసలు సమస్య. వాళ్ల జట్టు ఓ ఇమ్మెచ్యూర్ గ్రూప్‌లా ఉంది...

ఐపీఎల్ లాంటి టోర్నీలో 8వ ఓవర్‌లో సిక్సర్ కొట్టినందుకు ఎవ్వరైనా ఎగిరి గంతేసి సెలబ్రేట్ చేసుకుంటారా... ఇది పిల్లల ఆటలా లేదు...’ అంటూ కామెంట్ చేశాడు మైకెల్ వాగన్...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండో ఓవర్‌లో దేవ్‌దత్ పడిక్కల్ వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత శ్రీకర్ భరత్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆర్‌సీబీని ఆదుకున్నారు...

రాహుల్ చాహార్ బౌలింగ్‌లో ఓ సిక్సర్ బాదిన తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్, మ్యాచ్‌ను గెలిపించేసింత సంబరిపోతూ గాల్లోకి ఎగురుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు.. అయితే ఆ తర్వాతి బంతికే భరత్‌ను అవుట్ చేశాడు రాహుల్ చాహార్...

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్ 37 బంతుల్లో 6 ఫోర్లు,  3 సిక్సర్లతో 56 పరుగులు చేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది ఆర్‌సీబీ...

166 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్, మొదటి వికెట్‌కి 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి 111 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

గ్లెన్ మ్యాక్స్‌వెల్ 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా, చాహాల్ 11 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్ హ్యాట్రిక్ వికెట్లు తీయడంతో పాటు మొత్తంగా 4 వికెట్లు పడగొట్టి ముంబై పతనాన్ని శాసించాడు..

click me!