IPL2021: మళ్లీ ఆ రెండు జట్ల మధ్యే మొదటి మ్యాచ్... త్వరలో పూర్తి షెడ్యూల్...

First Published Jul 25, 2021, 5:59 PM IST

ఐపీఎల్ 2021 సీజన్, కరోనా కారణంగా అర్ధాంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా 13వ సీజన్‌ను తిరిగి ప్రారంభించనున్న బీసీసీఐ, తొలి మ్యాచ్‌ను టాప్ టీమ్స్ ముంబై, చెన్నై మధ్య పెట్టాలని భావిస్తోందట...

సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫేజ్ 2 ప్రారంభం కానుంది. కరోనా కారణంగా మధ్యలో ఆగిన సీజన్‌‌కి భారీ అంచనాలు పెంచేలా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ పెట్టాలని భావిస్తోంది మేనేజ్‌మెంట్...
undefined
ఫేజ్ 1లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి బంతిదాకా ఉత్కంఠభరితంగా సాగి, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాను అందించింది...
undefined
వరుస పరాజయాలతో ఫామ్ కోల్పోయినట్టు కనిపించిన ముంబై ఇండియన్స్‌కి ఊపునిచ్చే కమ్‌బ్యాక్ విజయం దాకా, ఐదు వరుస విజయాలు అందుకున్న సీఎస్‌కే జైత్రయాత్రకి బ్రేక్ పడిన మ్యాచ్ అదే...
undefined
గ్రూప్ 27వ మ్యాచ్‌గా జరిగిన ఈ ఫైట్‌లో సీఎస్‌కే మొదట బ్యాటింగ్ చేసి 218 పరుగుల భారీ స్కోరు చేయగా, కిరన్ పోలార్డ్ అద్భుత పోరాటంతో ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్...
undefined
అందుకే రీలాంఛ్‌‌లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహించాలని ఫిక్స్ అయ్యింది ఐపీఎల్ మేనేజ్‌మెంట్. షార్జా వేదికగా సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభం కానుందని సమాచారం...
undefined
ఇప్పటికే ఐపీఎల్ 2021 సీజన్‌లో 29 మ్యాచులు పూర్తికాగా, మిగిలిన 31 మ్యాచులను యూఏఈ వేదికగా నిర్వహించబోతున్నారు. టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 15లోగా ఐపీఎల్ ముగించాలని భావిస్తోంది బీసీసీఐ.
undefined
అక్టోబర్ 10న మొదటి క్వాలిఫైయర్, అక్టోబర్ 11న ఎలిమినేటర్, అక్టోబర్ 13న రెండో క్వాలిఫైయర్ జరిపి, 15న ఫైనల్ నిర్వహించబోతున్నట్టు సమాచారం...
undefined
మొదటి క్వాలిఫైయర్, ఫైనల్ రెండు మ్యాచులు దుబాయ్‌ వేదికగా జరిగితే రెండో క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచులు షార్జా వేదికగా నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది...
undefined
ఐపీఎల్2021 సీజన్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను మరికొన్ని రోజుల్లో విడుదల చేయబోతోంది బీసీసీఐ. యూఏఈలో హోటల్ బుకింగ్స్, ఏర్పాట్లు చేసుకునేందుకు సమయం కావాలని ఫ్రాంఛైజీలు కోరడంతో షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనుంది బీసీసీఐ.
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌ అర్ధాంతరంగా వాయిదా పడే సమయానికి ఆరు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్‌లో ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. ఆర్‌సీబీ మూడు, ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి.
undefined
click me!